ఎయిర్‌టెల్‌కి పోటీగా ఐడియా నుంచి సరికొత్త పోగ్రాం
జియో రాకతో దేశీయ టెలికాం మార్కట్లో ధర వర్సెస్ డేటా వార్ అన్నట్లుగా గత ఏడాది కాలం నుంచి యుద్ధం సాగుతూ వస్తోంది. యూజర్లను కాపాడుకునేందుకు కంపెనీలు సరికొత్త ఎత్తుగడలతో మార్కెట్లో దుమ్మురేపేందుకు సిద్ధంగా
జియో రాకతో దేశీయ టెలికాం మార్కట్లో ధర వర్సెస్ డేటా వార్ అన్నట్లుగా గత ఏడాది కాలం నుంచి యుద్ధం సాగుతూ వస్తోంది. యూజర్లను కాపాడుకునేందుకు కంపెనీలు సరికొత్త ఎత్తుగడలతో మార్కెట్లో దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ మధ్య ఎయిర్‌టెల్ కంపెనీ ఎయిర్‌టెల్ ధ్యాంక్స్ పేరుతో సరికొత్త పోగ్రాంను లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ పేరుతో ప్రారంభించిన ప్రోగ్రాంను విభిన్న సేవలు, కస్టమర్లకు వినూత్న అనుభవాన్ని కలిగించింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ మరింత కంటెంట్, డివైజ్, సెక్యూరిటీ, సర్వీసెస్, టాప్ బ్రాండ్స్ ఆఫర్లను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది.

ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రీపెయిడ్ కస్టమర్లకు ఆమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలు అందిస్తోంది. రూ.299కే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‍తో పాటు రోజుకు 2.5 జీబీ డేటా, 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఇదే తరహాలో ఐడియా కూడా ఓ అడుగు ముందుకేసింది. ప్లాన్ వివరాలను ఓ సారి పరిశీలిద్దాం.

Idea Privilege Program
దిగ్గజ టెలికాం సంస్థ ఐడియా వినియోగదారుల కోసం ఇప్పుడు Idea Privilege Programను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పోగ్రాంలో భాగంగా గోల్డ్, ప్లాటినం టైటానియం వంటి మూడు రకాల బెనిఫిట్లను అందిస్తోంది. వాటిని ఏ విధంగా పొందాలో క్లుప్తంగా పొందుపరిచింది .

Idea Select Gold Program
ప్రీ పెయిడ్ యూజర్లకు ముందుగా Gold tierతో ఈ పోగ్రాం స్టార్ట్ అవుతుంది.ఈ పోగ్రాంలో భాగస్వామ్యం కావాలంటే కనీసం మూడు నెలల నుండి ఐడియా నెట్ వర్క్ లో భాగస్వాములుగా ఉండాలి. అలాగే నెలకు రూ.375 వినియోగం ఉండి తీరాలి. యావరేజ్ గా 725 రూపాయల వరకు ఉండొచ్చు. అప్పుడే కొన్ని బెనిపిట్స్ వారికి అందుతాయి. కస్టమర్ కేర్ కి కాల్ చేయడం ద్వారా మీరు ఈ ఆఫర్ కు ఫాస్ట్ గా కనెక్ట్ కాబడతారు. అలాగే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కస్టమర్ కేర్ సర్వీస్ వేగంగా స్పందిస్తుంది. ఇతర రకాల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.దీనికి అర్హత సాధించిన వినియోగదారులు మూవీ టికెట్స్ మీద 20 శాతం తగ్గింపు 100 రూపాయల వరకు డిస్కౌంట్ పొందుతారు. వీటిని మై ఐడియా యాప్ ద్వారా రీడిమ్ చేసుకోవచ్చు. అలాగే 100కు పైగా బ్రాండ్లలో అంటే travel, fashion, footwear, fashion వంటి వాటిల్లో అట్రాక్టివ్ డీల్స్ ని పొందవచ్చు.

Idea Select Platinum Program
ఈ పోగ్రాంలో భాగస్వామ్యం కావాలంటే కనీసం మూడు నెలల నుండి ఐడియా నెట్ వర్క్ లో భాగస్వాములుగా ఉండాలి. అలాగే నెలకు రూ.725 వినియోగం ఉండి తీరాలి. యావరేజ్ గా 1500 రూపాయల వరకు ఉండొచ్చు. అప్పుడే కొన్ని బెనిపిట్స్ వారికి అందుతాయి. కస్టమర్ కేర్ కి కాల్ చేయడం ద్వారా మీరు ఈ ఆఫర్ కు ఫాస్ట్ గా కనెక్ట్ కాబడతారు. అలాగే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కస్టమర్ కేర్ సర్వీస్ వేగంగా స్పందిస్తుంది. ఇతర రకాల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.దీనికి అర్హత సాధించిన వినియోగదారులు ప్రతి నెల150 రూపాయల విలువ కలిగిన ఒక మ్యాట్నీ మూవీ టికెట్ BookMyShow ద్వారా ఉచితంగా పొందుతారు. అలాగే Idea Select Gold Programలో పొందిన మిగతా బెనిఫిట్లను కూడా పొందుతారు.

Idea Select Titanium Program
ఈ పోగ్రాంలో భాగస్వామ్యం కావాలంటే కనీసం మూడు నెలల నుండి ఐడియా నెట్ వర్క్ లో భాగస్వాములుగా ఉండాలి. యావరేజ్ గా 3000 రూపాయల వరకు ఐడియా రీఛార్జ్ చేసి ఉండాలి. అప్పుడే కొన్ని బెనిపిట్స్ వారికి అందుతాయి. కస్టమర్ కేర్ కి కాల్ చేయడం ద్వారా మీరు ఈ ఆఫర్ కు ఫాస్ట్ గా కనెక్ట్ కాబడతారు. అలాగే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కస్టమర్ కేర్ సర్వీస్ వేగంగా స్పందిస్తుంది. ఇతర రకాల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.అలాగే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కస్టమర్ కేర్ సర్వీస్ వేగంగా స్పందిస్తుంది. ఇతర రకాల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.అలాగే Idea Select Platinum Programలో పొందిన మిగతా బెనిఫిట్లను కూడా పొందుతారు.

ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్
ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ కింద మూడు నెలల నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, జీ5 సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం, హ్యాండ్ ప్రొటెక్షన్ సర్వీస్‌లు లభిస్తాయి. ఎయిర్‌టెల్ రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 125 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, పైన చెప్పిన ఎయిర్ టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ సేవలు అన్నీ లభిస్తాయి. అలాగే రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 150 జీబీ డేటా, రూ.1599 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా లు వస్తాయి. అలాగే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ సేవలు అన్నీ లభిస్తాయి.


Click it and Unblock the Notifications








