రూ.345కే 16జీబి 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

రిలయన్స్ జియో, రూ.303కే 28జీబి 4జీ డేటాను ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఐడియా సెల్యులార్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రస్తుతానికి, ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫ్లాన్‌లో భాగంగా రూ.345 చెల్లించటం ద్వారా 14జీబి 4జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌ను 28 రోజులు పాటు ఆస్వాదించవచ్చు.

Read More : షాకింగ్... నోకియా 3310 ఫోన్‌ ఆ దేశాల్లో పనిచేయదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పూర్తిగా అప్‌గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది

వాస్తవానికి, రూ.345 ప్లాన్‌ను ఐడియా సెల్యులార్ మూడు నెలల క్రితమే అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్పట్లో ఈ ప్లాన్‌ను సబ్‌స్క్కైబ్ చేసుకున్న ఐడియా చందాదారులకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు 50MB 4జీ డేటా మాత్రమే లభించేంది. కొత్త 4జీ హ్యాండ్ సెట్ యూజర్లకు మాత్రం అదనంగా 1జీబి 4జీబి లభించేంది. తాజా సవరణలో భాగంగా ఈ ప్లాన్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది.

రోజుకు 500 ఎంబి డేటా మాత్రమే..

ఈ కొత్త ప్లాన్‌కు కూడా ఐడియా కొన్ని లిమిటేషన్స్‌ను విధించినట్లు తెలుస్తోంది. రూ.345 ప్లాన్‌లో భాగంగా ఆఫర్ చేయనున్న 14జీబి 4జీ డేటా రోజుకు 500 ఎంబి చొప్పున 28 రోజునల పాటు అందుబాటులో ఉంటుంది.

‘My Idea’ యాప్‌లోకి వెళ్లి..

ఈ ఆఫర్‌ను ఎంపిక చేసుకునే ముందు ఐడియా యూజర్లు ‘My Idea' యాప్‌లోకి వెళ్లి ఆఫర్ తమ నెంబర్ కు ఆఫర్ అందుబాటులో ఉందోలేదో చెక్ చేసుకోవాలి.

రూ.148 రీఛార్జ్ పై 6జీబి డేటా..

ఈ ఆఫర్‌తో పాటు మరికొన్ని ఆఫర్లను కూడా ఐడియా ఆఫర్ చేస్తోంది. ఇవికూడా సెలెక్టెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రూ.248 రీఛార్జ్ పై 6జీబి డేటాతో పాటు రూ.248 టాక్ టైమ్ ను పొందవచ్చు. రూ.148 రీఛార్జ్ పై 6జీబి డేటాను పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Idea Cellular Started Offering 14GB of 4G Data and Unlimited Calling for Rs.345. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot