హైదరాబాద్ ఇంకా వైజాగ్‌లకు ఐడియా వై-ఫై సర్వీసులు!

Posted By:

 హైదరాబాద్ ఇంకా వైజాగ్‌లకు ఐడియా వై-ఫై సర్వీసులు!
ప్రముఖ మొబైల్ సర్వీస్ ఆపరేటర్, ఐడియా సెల్యులార్.. హైదరాబాద్, వైజాగ్, అహ్మదాబాద్, కొచ్చిన్ ఇంకా పూణే ప్రాంతాల్లో వై-ఫై సర్వీస్‌లను ఆవిష్కరించింది. ఈ సేవలను ఐడియా పోస్ట్ పెయిడ్ ఇంకా ప్రీపెయిడ్ యూజర్‌లు వినియోగించుకోవచ్చు. హైస్సీడ్ ఇంటర్నెట్‌ను సేవలను పొందేందుకు ఈ సర్వీస్ తోడ్పడుతుందని ఐడియా వెల్లడించింది.

ఈ సర్వీస్‌లను పొందే క్రమంలో పోస్ట్ పెయిడ్ యూజర్‌ల కోసం నెలవారి ఇంకా ద్వి వార్షిక ( bi-yearly) డేటా ప్లాన్‌లను కంపెనీ ఆఫర్ చేస్తుంది. నెలవారి డేటా ప్లాన్‌లను పరిశీలించినట్లయితే రూ.599 (10జీబి డేటా), రూ.799 (20జీబి డేటా), రూ.999 (30జీబి డేటా), రూ.1299 (50జీబి డేటా).

ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం క్వార్టర్లీ ఇంకా ద్వి వార్షిక డేటా స్కీమ్‌లను ఐడియా ఆఫర్ చేస్తోంది. క్వార్టర్లీ ప్లాన్‌లలో భాగంగా రూ.1499 చెల్లించి 15జీబి డేటాను పొందవచ్చు. రూ.2,499 చెల్లించి 40జీబి డేటాను వినియోగించుకోవచ్చు. రూ.3,499 చెల్లించి 80జీబి డేటాను వాడుకోవచ్చు. ద్వి వార్షిక ప్లాన్‌లలో భాగంగా రూ.2,999 చెల్లించి 30జీబి డేటాను పొందవచ్చు. రూ.4,999 చెల్లించి 80జీబి డేటాను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot