బ్యాటరీతో నడిచే ఐడియా 3జీ వైఫై డాంగిల్

Posted By:

ప్రముఖ టెలికం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ ‘స్మార్ట్‌వైఫై హబ్' పేరుతో సరికొత్త 3జీ వై-ఫై డాంగిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. బ్యాటరీతో నడిచే ఈ వై-ఫై హబ్‌ను 10 డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ధర రూ.2,999. 1500 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని ఈ డాంగిల్‌లో పొందుపరిచారు.

బ్యాటరీతో నడిచే ఐడియా 3జీ వైఫై డాంగిల్

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

బండిల్ ఆఫర్‌లో భాగంగా ఈ డాంగిల్ కొనుగోలు పై నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన 6జీబి 3జీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు ఐడియా తెలిపింది. విండోస్ ఎక్స్‌పీ, విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, లైనక్స్, మ్యాక్ వంటి అన్ని ప్రముఖ ఓఎస్‌లను ఈ డాంగిల్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

డాంగిల్ డౌన్‌లోడ్ వేగం 21.6ఎంబీపీఎస్ వరకు, అప్‌లోడ్ వేగం 11 ఎంబీపీఎస్ వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. 900 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లను ఈ డాంగిల్ సపోర్ట్ చేస్తుంది.

ఆంధప్రదేశ్, తెలంగాణ, చత్తిస్‌గఢ్, గుజరాత్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రా, ఉత్తర్‌ప్రదేశ్ (ఈస్ట్), ఉత్తర్‌ప్రదేశ్ (వెస్ట్), పంజాబ్ ప్రాంతాల్లోని అన్ని ఐడియా 3జీ మార్కెట్లలో ఈ డాంగిల్‌ను పొందవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Idea Launches Battery-Powered 3G Wi-Fi Dongle 'Smartwifi Hub' . Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot