రెడ్‌బస్‌తో ఐడియా మనీభాగస్వామ్యం!

Posted By: Madhavi Lagishetty

టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్ ఐడియా సెల్యూలర్ కు చెందిన డిజిటల్ వాలెట్ సంస్థ ఐడియా మనీ తాజాగా ఆన్‌లైన్‌ బస్ టికెటింగ్ ఫ్లాట్ ఫాం రెడ్‌బస్‌తో చేతులు కలిపింది. ఇందులో భాగంగా వినియోగదారులు అన్ని ఐడియా మనీ రిటైల్ పాయింట్లలో రిటైలర్ల సాయంతో ఐడియా మనీ రిటైలర్ అసిస్టెడ్ మోడల్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్లో బస్ టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

రెడ్‌బస్‌తో ఐడియా మనీభాగస్వామ్యం!

ఐడియా మనీ రిటైలర్ అసిస్టెడ్ మోడల్ కింద రెడ్ బస్ తో భాగస్వామం కుదుర్చుకోవడంతోపాటు మరో పోర్ట్ పోలియోను ఆఫర్ చేస్తామని ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్ రామసుబ్రమణ్యం తెలిపారు.

ఇండియాలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో అనేక రూట్లలో ప్రైవేట్, ప్రభుత్వ బస్సుల్లో సీట్లను బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. తమ వినియోగదారులకు మరిన్ని సేవలు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.

ఐడియా మనీ యొక్క రిటైల్ పాయింట్ వద్ద రిటైలర్ సహాయంతో రామ్ పోర్టల్ ద్వారా వినియోగదారులు బస్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.

అమ్మకానికి రెడీగా షియోమి ఎంఐ మిక్స్ 2!

జిఎస్ఆర్టీసీ, యుపిఎస్ఆర్టీసి వంటి ప్రైవేట్, ప్రభుత్వ బస్సుల ద్వారా 70,000కుపైగా రూట్లలో టిక్కెట్ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి.

దేశంలోని నగరాలు, పట్టణాలు మరియు గ్రామాల మధ్య మెరుగైన అనుసంధానం ఉండటంతో భారతదేశంలో రోడ్డు రవాణా పెరుగుతోంది. అయినప్పటికీ టెక్నాలజీ ఆధారిత ఎలక్ట్రానిగ్ టికెట్ బుకింగ్ మరియు దాని చుట్టూ ఉన్న టైర్ 2,3,4 మార్కెట్లలో అవగాహన తక్కువగా ఉంటుంది.

ఐడియాతో భాగస్వామ్యం వల్ల దాదాపు 1.8మిలియన్ రిటైలర్లు ఐడియా యొక్క నెట్ వర్క్, రెడ్ బస్ తమ సేవలు అందుబాటులో ఉంటాయని సంస్ధ తెలిపింది. ఈ రెండింటి భాగస్వామ్యంతో కస్టమర్లకు మరియు రిటైలర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.

English summary
The new collaboration will allow customers to book bus tickets online through Idea Money’s RAM portal with the help of the retailer.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot