ఐడియా మనీ ద్వారా USSD చెల్లింపులు

తమ ఐడియా డిజిటల్ పేమెంట్ సర్వీసులను ఉపయోగించుకుంటోన్న యూజర్లకు USSD ఆధారిత డిజిటల్ చెల్లింపులను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు ఐడియా సెల్యులార్ పెర్కొంది. కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ సదుపాయం ద్వారా నగుదును ఐడియా మనీ వాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవటంతో పాటు బిల్లులు చెల్లించటం, రీఛార్జులు చేసుకోవటం, దుకాణాల్లో డబ్బులు పే చేయటం వంటి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

యూట్యూబ్ గో.. ఇంటర్నెట్ లేకుండా వీడియోలు చూడండి

ఐడియా మనీ ద్వారా  USSD చెల్లింపులు

ఇక మర్చెంట్స్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన 'ఫుల్ పేమెంట్స్' ఫీచర్ ద్వారా చెల్లింపులకు సంబంధించిన రసీదులను వ్యాపారులు, కస్టమర్‌ల మొబైల్ నెంబర్‌లకు పంపే వీలుంటుంది. లావాదేవీలు చేపడుతున్న సమయంలో వినియోగదారుడు తన మొబైల్‌కు అందిన OTPని దుకాణ యజమానికి చెబితే చాలు. లావాదేవీ విజయవంతగా పూర్తవుతుంది. చెల్లింపునుకు సంబంధించిన రసీదు ఆ నెంబర్‌కు అందుతుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న మిగితా డిజిటల్ పేమెంట్ ఫీచర్లతో పోలిస్తే ఇది చాల సులువైన పద్ధతి అని ఐడియా సెల్యులార్ తెలిపింది.

ఇంటర్నెట్‌లో ఇలాంటి పనులు చేస్తే జైలుకే..?

ఐడియా మనీ ద్వారా  USSD చెల్లింపులు

అయితే ఈ USSD సేవలను పొందే ఐడియా యూజర్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానమై ఉండాలి. అనుసంధానమైన ఉన్నట్లయితే *400# కోడ్‌ను ఉపయోగించుకుని చెల్లింపులను చేపట్టవచ్చు. USSD ఆధారిత డిజిటల్ చెల్లింపులకు ఇంటర్నెట్‌తో పనిలేదు, స్మార్ట్‌ఫోన్ కూడా అవసరం ఉండదు. సాధారణ మొబైల్ ఫోన్ నుంచి సైతం ఈ సేవలను పొందవచ్చు.

మీ ఫోన్ ఎంత రేడియోషన్‌ను విడుదల చేస్తుందో తెలుసా..?

English summary
Idea Money rolls out USSD-based transaction. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot