ఐడియా సరికొత్త ఆఫర్, ఏడాది పాటు రోజుకు 1.5 జిబి డేటా

ప్రముఖ టెలికం కంపెనీ ఐడియా సెల్యులార్ రెండు కొత్త రీచార్జ్ ప్లాన్లను ఆవిష్కరించింది. రూ.999, రూ.1,999 ల పేరిట రెండు నూత‌న ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. రూ.999 ప్లాన్‌లో క‌స్

|

ప్రముఖ టెలికం కంపెనీ ఐడియా సెల్యులార్ రెండు కొత్త రీచార్జ్ ప్లాన్లను ఆవిష్కరించింది. రూ.999, రూ.1,999 ల పేరిట రెండు నూత‌న ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. రూ.999 ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 12 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణ‌యించారు. అలాగే రూ.1,999 ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 365 రోజులే కావ‌డం విశేషం.

 
 ఐడియా సరికొత్త ఆఫర్, ఏడాది పాటు రోజుకు 1.5 జిబి డేటా

అయితే రూ.999 ప్లాన్ కేవ‌లం పంజాబ్ స‌ర్కిల్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌గా, రూ.1,999 ప్లాన్ కేర‌ళ స‌ర్కిల్ క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే ల‌భిస్తున్న‌ది. త్వ‌ర‌లో ఈ రెండు ప్లాన్లు దేశంలోని ఇత‌ర ఐడియా సెల్యులార్ ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు కూడా ల‌భ్యం కానున్నాయి.

వొడాఫోన్ ఐడియా ఐబీఎం ఒప్పందం

వొడాఫోన్ ఐడియా ఐబీఎం ఒప్పందం

దేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ టెక్‌ జెయింట్‌ ఐబీఎంతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఐఐఎం టెక్నాలర్తో ఐఐఎంతో ఐబీఎంతో ఐదేళ్లకుగాను మల్టీ డాలర్‌ ఐటీ ఔట్‌ సోర్సింగ్‌ ఒప్పందాన్ని చేసుకున్నామని తెలిపింది. ఐబీఎం హైబ్రిడ్ మల్టీక్లౌడ్, ఎనలిటిక్స్‌, ఏఐ భద్రతా సామర్ధ్యాల వాడకంలో వొడాఫోన్ ఐడియా పురోగతిని ఈ డీల్‌ వేగవంతం చేస్తుందని ప్రకటించింది.

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌

ప్రధానంగా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, థింగ్స్ ఇంటర్నెట్, ఫాస్ట్ ట్రాక్ లాంటి ఉమ్మడి కార్యక్రమాలు కోసం ఐదు-సంవత్సరాల ఒప్పందం తమకు నూతన అవకాశాలను కల్పిస్తుందని కంపనీ తెలిపింది. వోడాఫోన్- ఐడియా విలీనం లక్ష్యాల సాధనలో ఐటీ సంబంధిత ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని వొడాఫోన్‌ ఐడియా తెలిపింది.

700 మిలియన్ల డాలర్లు
 

700 మిలియన్ల డాలర్లు

ఒప్పంద విలువను కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ 700 మిలియన్ల డాలర్లుగా ఉందని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. కాగా 387 మిలియన్ల చందాదారులతో (డిసెంబరు 31, 2018 నాటికి)వొడాఫోన్‌ ఐడియా కంపెనీకి హైబ్రిడ్ క్లౌడ్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో వ్యాపార సామర్థ్యత, చురుకుదనం, స్థాయితోపాటు వ్యాపార ప్రక్రియల సరళీకరణకు తోడ్పడనుంది. తద్వారా భారతదేశంలో లక్షలాది వినియోగదారులకు, వ్యాపారులకు మెరుగైన కస్టమర్ అనుభవాన్ని కూడా అంంచనుంది.

బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి ఐడియా

బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి ఐడియా

ఐడియా ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి ప్రవేశించింది. ఇందులో భాగంగానే పూనేలో హై స్పీడ్ వైర్డ్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ను ప్రారంభించింది.ఇప్పుడు కంపెనీ తన హోమ్ బ్రాడ్‌బ్యాండ్ మరియు అల్ట్రా ఫాస్ట్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల లో హై స్పీడ్ అందిస్తోంది.

ఐడియా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 449 నుంచి 949 వరకు ఉంది.ఈ ప్లాన్ లలో, వినియోగదారులు గరిష్టంగా 4 Mbps మరియు 600GB FUP వేగం పొందుతారు.అల్ట్రా ఫాస్ట్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు రూ. 699 నుండి 2,499 రూపాయల వరకు అందుబాటులో వున్నాయి.ఈ ప్లాన్ల లో, వినియోగదారులు గరిష్టంగా 200 Mbps మరియు 500GB FUP వేగం పొందుతారు.

పుణేలోని కొన్ని ప్రదేశాలలో మాత్రమే

పుణేలోని కొన్ని ప్రదేశాలలో మాత్రమే

కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో వీటిని అప్డేట్ చేసింది.వెబ్ సైట్ ప్రకారం, పుణేలోని కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఈ ప్లాన్స్ ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. దేశీయ వినియోగదారుల కోసం ఐడియా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కేటగిరిలో ఆరు కొత్త ప్లాన్ లను ప్రవేశపెట్టారు.449 రూపాయల ప్లాన్ లో ప్రతి బిల్లింగ్లో 2 Mbps డౌన్లోడ్ స్పీడ్ మరియు 30 GB పొందుతారు.డేటా పరిమితి ముగిసిన తర్వాత, ఈ స్పీడ్ FUP 512 Kbps అవుతుంది.

ఇన్స్టాలేషన్ ఛార్జ్ 500 రూపాయలు

ఇన్స్టాలేషన్ ఛార్జ్ 500 రూపాయలు

బ్రాడ్‌బ్యాండ్ కేటగిరిలో అదనంగా, ఐడియా యొక్క ఇతర ఐదు ప్లాన్లు 4 Mbps డౌన్లోడ్ స్పీడ్ తో వస్తున్నాయి.మంత్లీ డేటా పరిమితి క్రాస్ తర్వాత, అన్ని ప్లాన్ డేటా స్పీడ్ ప్లాన్స్ ప్రకారం మార్చబడుతుంది. ఈ నెలవారీ ప్లాన్ తో, మొదటి సారి ఇన్స్టాలేషన్ ఛార్జ్ 500 రూపాయలుగా ఉంది. చిన్న తరహా వ్యాపారుల కోసం రూ. 699, రూ. 899 ధర తో ప్రతి బిల్లింగ్ సైకిల్ లో 40 Mbps స్పీడ్ తో మరియు 40GB మరియు 75GB డేటాతో కొన్ని రకాల ప్లాన్లను అందిస్తోంది.

100 Mbps స్పీడ్

100 Mbps స్పీడ్

దీంతో పాటు 100 Mbps స్పీడ్ తో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది..ఇవి 1,099, 1,299, 1,499 1,799 మరియు 2,099 రూపాయలు.ఈ మూడు ప్లాన్లు వరుసగా 120GB, 175GB, 225GB, 300GB, 400GB డేటా స్పీడ్ తో లభిస్తాయి. 1,099 మరియు 1,299 రూపాయల ప్లాన్లు డేటా పరిమితి దాటిన తరువాత, 2 Mbps FUP స్పీడ్ లోకి ఇతర మూడు ప్లాన్లు 4 Mbps స్పీడ్ లోకి మారిపోతాయి.

Best Mobiles in India

English summary
idea new rs 999 1999 prepaid plan launched 365 days validity

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X