సోనీ జంట ఫోన్‌ల పై ఐడియా సంచలన ఆఫర్!

|

ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ ఐడియా సెల్యులార్, సోనీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌లో భాగంగా ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన సోనీ ఎక్స్‌పీరియా ఆర్1 ప్లస్, ఎక్స్‌పీరియా ఆర్1 స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఆఫర్‌ను ఐడియా అనౌన్స్ చేసింది. ఈ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌లను కొనుగోలు చేసే ఐడియా కస్టమర్‌లకు 60జీబి 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది.

 
సోనీ జంట ఫోన్‌ల పై ఐడియా సంచలన ఆఫర్!

ఈ డేటా 6 సార్లుగా యూజర్ అకౌంట్‌లో యాడ్ అవతుంది. ఐడియా కనెక్షన్ యూజర్లు ఈ 4జీ బండిల్ ఆఫర్ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సోనీ సెంటర్‌లలో పొందవచ్చని సంస్థ ప్రకటించింది.

సోనీ నుంచి ఎక్స్‌పీరియా ఆర్1 ప్లస్ (ధర రూ.14,990), ఎక్స్‌పీరియా ఆర్1 (ధర రూ.12,990) స్మార్ట్‌ఫోన్‌లు కొద్ది రోజుల క్రితమే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఆన్‌లైన్ మార్కెట్లో అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లు ఈ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తున్నాయి.

రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించేది ఈ మూడే, గుట్టు విప్పిన మైక్రోసాఫ్ట్ సీఈవోరానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించేది ఈ మూడే, గుట్టు విప్పిన మైక్రోసాఫ్ట్ సీఈవో

ఎక్స్‌పీరియా ఆర్1 స్పెసిఫికేషన్స్...

5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 720x1280 పిక్సల్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2620ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 3డీ స్కానింగ్ మోడ్, 4జీ వోల్ట్ సపోర్ట్, అప్‌లింక్ డేటా కంప్రెషన్ మోడ్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, ఫోన్ చుట్టుకొలత 146x73.2x8.89 మిల్లీ మీటర్లు, బరువు 154 గ్రాములు.

ఎక్స్‌పీరియా ఆర్1 ప్లస్ స్పెసిఫికేషన్స్...

5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 720x1280 పిక్సల్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం(అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2620ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 3డీ స్కానింగ్ మోడ్, 4జీ వోల్ట్ సపోర్ట్, అప్‌లింక్ డేటా కంప్రెషన్ మోడ్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, ఫోన్ చుట్టుకొలత 146x73.2x8.89 మిల్లీ మీటర్లు, బరువు 154 గ్రాములు.

Best Mobiles in India

English summary
Idea Cellular and Sony has joined hands to offer some good deals on 4G data plans for customers purchasing the latest Sony Xperia R1 Plus and R1 smartphone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X