60 రీచార్జ్‌తో 100 టాక్‌టైమ్!

Posted By: Super

60 రీచార్జ్‌తో 100 టాక్‌టైమ్!

ఆశ్చర్యంగా ఉన్నప్పటికి, అంతా మీ అదృష్టం పై ఆధారపడి ఉంది. ప్రముఖ టెలికామ్ ప్రొవైడర్ ఐడియా ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల కోసం ‘మ్యాజిక్ రిచార్జ్ ఔచర్’ను లాంచ్ చేసింది. ఈ కూపన్ ధర రూ.60. టాక్‌టైమ్ మీ లక్కును బట్టి రూ.51 నుంచి రూ.100 లోపు వస్తుంది. ఈ టాపప్ ద్వారా మీరు నష్టపోయేదేమి ఉండదు. అదృష్టం బాగుంటే అదనపు టాక్‌టైమ్ మీ సొంతమవుతుంది. పేపర్ కూపన్ అదేవిధంగా ఈ-రీచార్జ్ ద్వారా ‘మ్యాజిక్ రీచార్జ్’ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రముఖ రిటైల్ అవుట్‌

లెట్‌లతో పాటు రాష్ట్రంలోని అన్ని మై ఐడియా షోరూమ్‌లలో ఈ రిచార్జ్ లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot