1జీబి ధరకే 15జీబి 4జీ డేటా

ఫ్లిప్‌కార్ట్‌తో చేతులు కలిపిన ఐడియా సెల్యులార్ సరికొత్త 4జీ ఆఫర్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేు ప్రతి 4జీ స్మార్ట్‌ఫోన్ పై 1జీబి ధరకే 15జీబి 4జీ డేటాను ఐడియా ఆఫర్ చేయనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐడియా ప్రీపెయిడ్ యూజర్ అయి ఉండాలి

ఈ ఆఫర్‌ను పొందాలంటే మీరు తప్పనిసరిగా మీరు ఐడియా సిమ్ వాడుతుండాలి. ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త 4జీ ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే మీకో కొత్త ఐడియా 4జీ సిమ్ లభిస్తుంది.

మీకో కొత్త ఐడియా 4జీ సిమ్ లభిస్తుంది

ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త 4జీ ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే మీకో కొత్త ఐడియా 4జీ సిమ్ లభిస్తుంది. వెంటనే మీ నెంబర్‌తో ఆ సిమ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవల్సి ఉంటుంది.

సిమ్ అప్‌గ్రేడ్ అయిన వెంటనే

సిమ్ అప్‌గ్రేడ్ అయిన వెంటనే కొత్త ఫోన్‌లో ఇన్సర్ట్ చేయండి. నెట్‌వర్క్ సెటప్ అయిన తరువాత ఐడియా నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని (http://i4all.ideacellular.com/offers/get-headerinfo.htm) లింక్‌లోకి వెళ్లి మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.

OTP (one time password) అందుతుంది

వెంటనే OTP (one time password) అందుతుంది. SMS వెరిఫికేషన్ పూర్తి అయిన తరువాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వెంటనే 1జీబి డేటాను రీఛార్జ్ చేయించండి. ఆటోమెటిక్‌గా మీ అకౌంట్‌లో 14జీబి యాడ్ అవుతుంది.

ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు, మార్చి 31 వరకు మూడు సార్లు

ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఈ 1జీబి ఆఫర్‌ను మార్చి 31 వరకు మూడు సార్లు ఆస్వాదించవచ్చు. 4జీ నెట్‌వర్క్ అందుబాటులో లేని వారికి 3జీ డేటా వర్తిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Idea Offers 15GB of Data for 1GB Price to Buyers of 4G Smartphones From Flipkart. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot