ఐడియా రూ. 3300 మ్యాజిక్ ఆఫర్, 70 రోజుల వ్యాలిడిటీతో..

Written By:

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఐడియా జియోతో పోటీ పడుతూ సరికొత్తగా ముందుకు దూసుకువచ్చింది. జియో రాకతో ధరల యుద్ధానికి తెరలేపిన తరుణంలో ఇప్పుడు అన్ని టెల్కోలు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఐడియా రిలయన్స్ జియోకి కౌంటర్ వేసింది. మ్యాజిక్ ఆఫర్ పేరుతో సరికొత్తగా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ ని ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద 3,300 రూపాయల విలువైన క్యాష్‌బ్యాక్‌ను వినియోగదారులకు అందించనున్నట్టు ఐడియా తెలిపింది.

డేటా పరిమితిని పెంచిన BSNL, 90 రోజుల వ్యాలిడిటీతో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

50 రూపాయలతో కూడిన ఎనిమిది డిస్కౌంట్‌ ఓచర్లను ..

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు, పలు ఆన్‌లైన్‌ ఛానళ్లను వాడుతూ 398 రూపాయలు, ఆపై మొత్తాలతో కూడిన అపరిమిత ప్లాన్లను రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు ఈ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుందని ఐడియా పేర్కొంది. క్యాష్‌బ్యాక్‌ కింద 50 రూపాయలతో కూడిన ఎనిమిది డిస్కౌంట్‌ ఓచర్లను అందించనున్నట్టు తెలిపింది.

ఏడాదిపాటు రిడీమ్‌ ..

ఈ డిస్కౌంట్‌ ఓచర్లను కస్టమర్లు తర్వాత రీఛార్జ్‌ చేయించుకునే 300 రూపాయలు, ఆపై మొత్తాలపై ఏడాదిపాటు రిడీమ్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఓచర్లతో పాటు 2,700 రూపాయల విలువైన ఐదు షాపింగ్‌ కూపన్లను కూడా అందించనున్నట్టు తెలిపింది. వీటిని తమ పార్టనర్‌ స్లోర్లు లేదా వెబ్‌సైట్లలో వినియోగించుకోవచ్చని కుమార్‌మంగళం బిర్లా చెప్పారు.

200 రూపాయల వరకు వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌ ..

మై ఐడియా యాప్‌ లేదా కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా రీఛార్జ్‌ చేయించుకున్న కస్టమర్లకు, 200 రూపాయల వరకు వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. 

398 రూపాయల ప్లాన్‌ కింద..

398 రూపాయల ప్లాన్‌ కింద ఐడియా అపరిమిత వాయిస్‌ కాల్స్‌(లోకల్‌, ఎస్టీడీ, నేషనల్‌ రోమింగ్‌ కాల్స్‌)ను, రోజుకు 1జీబీ డేటాను, 100 ఎస్‌ఎంఎస్‌లను 70 రోజుల పాటు అందించనుంది. ఈ మ్యాజిక్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఐడియా ప్రీపెయిడ్‌ కస్టమర్లందరికీ 2018 ఫిబ్రవరి 10 వరకు అందుబాటులో ఉండనుంది.

ఇప్పటికే..

కాగా ఇప్పటికే జియో, Airtel లాంటి దిగ్గజాలు తమ వినియోగదారులు చేజారిపోకుండా భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వొడాఫోన్ అలాగే బిఎస్ఎన్ఎల్ కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో మార్కెట్లోకి దూసుకువచ్చిన సంగతి తెలిసిందే. మరి రానున్న కాలంలో ఈ టారిఫ్ వార్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందనని టెక్ విశ్లేషకులు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Idea offers worth Rs 3,300 cashback on recharge of Rs 398 and above More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot