ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ కొంటే ఆఫర్లే ఆఫర్లు

ఫ్లిప్‌‌కార్ట్‌లో విక్రయిస్తోన్న బెస్ట్ సెల్లింగ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల పై ఐడియా సెల్యులార్ ఎక్స్‌క్లూజివ్ డేటా ఆఫర్లను ప్రకటించింది. ఈ డేటా ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లకు మాత్రమే వర్తిస్తాయి. 4జీ స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ అయ్యే ఐడియా ప్రీపెయిడ్ యూజర్లు రూ.356 లేదా రూ.191 స్పెషల్ రీచార్జులను చేయించుకోవటం ద్వారా భారీ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ కొంటే ఆఫర్లే ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌లో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన ఐడియా యూజర్లు రూ.356 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా ఎటువంటి డైలీ డేటా లిమిట్ లేకుండా 30జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా లోకల్ ఇంకా నేషనల్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.191 స్పెషల్ రీఛార్జ్ తీసుకునేవారికి 10జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ కొంటే ఆఫర్లే ఆఫర్లు

లెనోవో, మైక్రోమాక్స్, మోటరోలా, పానాసోనిక్ బ్రాండ్‌లకు సంబంధించి రూ.4,000 నుంచి రూ.25,000 రేంజ్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల పై ఈ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఐడియా తెలిపింది. ఐడియా పాత కస్టమర్‌లతో పాటు కొత్త కస్టమర్‌లకు కూడా ఈ స్పెషల్ రీఛార్జులు వర్తిస్తాయి.

English summary
Idea partners with Flipkart to offer best deals on 4G smartphones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot