3జీ ఇక చవకజీ!!

Posted By: Prashanth

3జీ ఇక చవకజీ!!

 

3జీ సర్వీసుల టారిఫ్‌లను 70% వరకూ తగ్గిస్తున్నామని ఐడియా సెల్యులార్ ప్రకటించింది. గత వారంలో 3జీ టారిఫ్‌లను భారతీ ఎయిర్‌టెల్ తగ్గించిన విషయం తెలిసిందే. 10 కేబీ డేటాకు 10 పైసలుగా ఉన్న రేటును 3 పైసలకు తగ్గిస్తున్నామని, ప్రి పెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఇది వర్తిస్తుందని ఐడియా పేర్కొంది. వివిధ ప్లాన్‌ల కింద యూసేజ్ లిమిట్‌ను కూడా పెంచామని తెలిపింది. రూ. 10కి 30 నిమిషాల హై స్పీడ్ ఇం టర్నెట్ సర్ఫింగ్‌ను(ఒక్క రోజు వ్యాలిడిటి), రూ. 25కు 100 ఎంబీ డేటాను(3రోజుల వ్యాలిడిటీ) ఆఫర్ చేస్తున్నామని వివరించింది. రోజుకు రూ.8కి అన్‌లిమిటెడ్ 3జీని ఎయిర్‌సెల్ ఆఫర్ చేస్తోం ది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు 3జీ టారిఫ్‌లను తగ్గిస్తాయని విశ్లేషకులంటున్నారు.

మొబైల్ ధరలు పెరిగే అవకాశం!

సెల్‌ఫోన్ల ధరలు మరో సారి పెరిగే సూచననలు కనిపిస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అనూహ్యంగా పడిపోవడమే ఇందుకు కారణం. డాలర్ విలువ రోజురోజుకూ పెరుగుతుండడంతో సెల్‌ఫోన్ కంపెనీలు బెంబేలెత్తున్నాయి. భారత్‌ మార్కెట్లో అమ్ముడవుతున్న ఫోన్లలో సగానికంటే ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్నవే. కొనుగోళ్లు డాలర్ రూపంలో జరుగుతుండడంతో ధరల భారం తడిసి మోపెడై కంపెనీలకు దిక్కుతోచడం లేదు. ఇక ధరలు పెంచితేగానీ మార్కెట్లో నిలదొక్కుకోలేమనే భావనకు వచ్చాయి.

నోకియా, సామ్‌సంగ్, బ్లాక్‌బెర్రీ తదితర కంపెనీలకు సైతం పాలుపోవడం లేదు. ఇప్పటికే సెల్‌ఫోన్ కంపెనీల మధ్య గట్టిపోటీయే ఉంది. ధర పెంపు విషయంలో ఏ ఒక్క కంపెనీ ముందుగా స్పందించినా, మిగిలిన కంపెనీలు దాని దారిన నడవాలని భావిస్తున్నట్టు సమాచారం.రూపాయి పతనం కారణంగా గతేడాది కూడా నోకియా, శాంసంగ్, ఎల్‌జీ, ఏసర్‌తోపాటు దేశీయ సెల్‌ఫోన్ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్, స్పైస్, లావా, ఒనిడా వంటి కంపెనీలన్నీ ధరలను పెంచాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting