ఐడియా ఆఫర్లలో మార్పు, చెక్ చేసుకోండి

రిలయన్స్ జియో నుంచి ఎదురవుతోన్న తీవ్రమైన ఒత్తిడిని ఫేస్ చేసే క్రమంలో దాదాపుగా అన్ని ప్రముఖ టెలికం ఆపరేటర్స్ సరికొత్త ప్లాన్‌లతో ముందుకొస్తున్నాయి. జియోకు తొలి నుంచి పోటీగా నిలుస్తోన్న టెలికం ఆపరేటర్ల జాబితాలో Idea కూడా ఒకటి. భారతి ఎయిర్‌టెల్ , వొడాఫోన్ నెట్‌వర్క్‌ల తరువాత, తనదైన రీతిలో సత్తా చాటుతోన్న ఐడియా సెల్యులార్ తాజాగా తన 3జీ, 2జీ డేటా ప్యాక్‌లలో మార్పు చేర్పులు చేసింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారా..? జరభద్రం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గతంలో రూ.46 చెల్లిస్తే ..

గతంలో రూ.46 చెల్లిస్తే 120 ఎంబి 3జీ డేటాను మాత్రమే ఐడియా ఆఫర్ చేసిది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉండేది. తాజా సవరణలో భాగంలో రూ.46 చెల్లించినట్లయితే 150 ఎంబి 3జీ డేటా మీకు లభిస్తుంది. ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

గతంలో రూ.36 చెల్లిస్తే..

గతంలో రూ.36 చెల్లిస్తే 120 ఎంబి 2జీ డేటాను మాత్రమే ఐడియా ఆఫర్ చేసిది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉండేది. తాజా సవరణలో భాగంలో రూ.36 చెల్లించినట్లయితే 180 ఎంబి 2జీ డేటా మీకు లభిస్తుంది. ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

రూ.69 చెల్లిస్తే..

తాజా సవరణలో భాగంగా రూ.69 చెల్లిస్తే 1జీబి 3జీ డేటా ఐడియా యూజర్లకు లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 15 రోజులుగా ఉంటుంది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.149 చెల్లించినట్లయితే..

తాజా సవరణలో భాగంగా రూ.149 చెల్లించినట్లయితే 1.5జీబి 3జీ డేటాను ఐడియా యూజర్లు పొందే అవకాశం ఉంది. గతంలో 1జీబి మాత్రమే లభించేది. ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

రూ.649 చెల్లించినట్లయితే..

రూ.649 చెల్లించినట్లయితే 5.5జీబి 3జీ డేటా మీకు లభిస్తుంది. గతంలో 5 జీబి మాత్రమే లభించేది.ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

రూ.449 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే..

రూ.449 పెట్టి రీఛార్జ్ చేయించటం ద్వారా 3.5జీబి 3జీ డేటాను ఐడియా యూజర్లు పొందవచ్చు. గతంలో 3 జీబి మాత్రమే లభించేది. ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

రూ.849 పెట్టి రీఛార్జ్ చేయించినట్లయితే

రూ.849 పెట్టి రీఛార్జ్ చేయించినట్లయితే 7.5జీబి 3జీ డేటాను ఐడియా యూజర్లు పొందవచ్చు. గతంలో 7 జీబి మాత్రమే లభించేది. ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Idea Revised it's 3G and 2G Data Plans to Take on Reliance Jio. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting