జియో రూ. 398కి ప్లాన్‌కి కౌంటర్, రూ. 399 ప్లాన్‌తో దూసుకొచ్చిన ఐడియా !

Written By:

జియో రోజు రోజుకు టెలికం మార్కెట్లో దూసుకుపోతున్న నేపథ్యంలో దిగ్గజాలు జియోని ధీటుగా ఎదుర్కునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. జియో ప్రకటించిన ప్లాన్లకు పోటీగా సరికొత్త ప్లాన్లను మార్కెట్లోకి వదులుతూ వినియోగదారులను ఇతర నెట్‌వర్క్‌లోకి తరలిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జియో రూ. 399కి పోటీగా ఐడియా రూ. 398 ప్లాన్‌తో దూసుకొచ్చింది.

ఇండియాలో ఇంటర్నెట్ వేగం ఎంతో తెలుసుకోండి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 398తో రీచార్జి చేసుకుంటే..

జియోకి పోటీగా వచ్చిన ఈ ప్లానులో ఐడియా కష్టమర్లు రూ. 398తో రీచార్జి చేసుకుంటే వారికి రోజుకు 1జీబీ ఉచిత డేటా లభిస్తుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ వస్తాయి.

వాలిడిటీ 70 రోజులు..

వీటిని రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల వరకు వాడుకునేందుకు వీలుంటుంది. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులుగా ఉంది.

జియోలో రూ.399 ప్లాన్‌కు పోటీ

జియోలో రూ.399 ప్లాన్‌కు ఇదే బెనిఫిట్స్ లభిస్తుండగా ఇప్పుడు ఐడియా కూడా రూ.398 ప్లాన్‌తో ఈ బెనిఫిట్స్‌ను తన కస్టమర్లకు అందిస్తుంది.

రూ.51 విలువైన 7 వోచర్లు

ఈ ప్లాన్‌తోపాటు ఐడియా మరో ఆఫర్‌ను కూడా లాంచ్ చేసింది. దాని ప్రకారం.. ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి ఒక్కోటి రూ.51 విలువైన 7 వోచర్లు లభిస్తాయి.

రూ.300 ఆపైన రీచార్జిలకు

వీటిని తరువాత వారు చేసుకునే రూ.300 ఆపైన రీచార్జిలకు వాడుకోవచ్చు. దీంతో రీచార్జి చేసుకున్నప్పుడల్లా రూ.51 మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలా ఆ 7 వోచర్లను ఒక్కక్కటి ఒక్కసారి వాడుకోవచ్చు.

మరో రూ.309 ప్లాన్‌తో..

ఇక మరో రూ.309 ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే వినియోగదారులకు రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ 28 రోజుల పాటు వస్తాయి. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 250, వారానికి 1000 నిమిషాల వాయిస్ కాల్స్‌ను పొందుతారు.

ఐడియా వెబ్‌సైట్ లేదా, యాప్ ద్వారా..

దీంతో పాటు ఐడియా వెబ్‌సైట్ లేదా, యాప్ ద్వారా ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే అదనంగా మరో 1జీబీ డేటా కూడా ఉచితంగా లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Idea Rivals Jio With New Rs. 398 Plan With 1GB Data Per Day, Free Roaming Calls for 70 Days Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot