ఐడియా..ఎంత మాట్లాడితే అంత కట్

Written By:

టెలికం సంస్థ ఐడియా సెల్యూలార్ తాజాగా తమ ప్రిపెయిడ్ కష్టమర్ల కోసం సెకన్ ప్లాను పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.ఇప్పటికే చాలామంది ప్రి పెయిడ్ యూజర్లు పర్ సెకను బిల్లింగ్ నే ఉపయోగిస్తున్నట్లు పర్ మినిట్ బిల్లింగ్ ప్లాన్ లో ఉన్న కోటి మంది యూజర్లను కూడా వచ్చే 30 రోజుల్లో పర్ సెకను ప్లాన్ కు మారుస్తున్నట్లు తెలిపింది.

Read more: బ్యాటరీతో నడిచే ఐడియా 3జీ వైఫై డాంగిల్

ఐడియా..ఎంత మాట్లాడితే అంత కట్

మొత్తం 16.6 కోట్ల మంది యూజర్లలో 15.7 కోట్లమంది ప్రి పెయిడ్ ప్లాన్లను ఉపయోగిస్తున్నట్లు ఐడియా సెల్యులార్ వివరించింది. ఇప్పటి దాకా పర్ మినిట్,పర్ సెకన్ ప్లాన్ రెండింటినీ అందిస్తూ వచ్చామని ఇకపై మొత్తం 15. 5 కోట్ల మంది ప్రి పెయిడ్ యూజర్లకు పూర్తిగా సెకన్ ప్లాను అమలవుతుందని సంస్థ చీప్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు.ఇటీవలి కాలంలో కాల్ డ్రాప్ సమస్య వివాదస్పదమైన నేపథ్యంలో టెలికం కంపెనీలు ఒక్కొక్కటిగా ప్రి పెయిడ్ యూజర్లకు పర్ సెకను ప్లాను అమలు చేయడం తెలిసిందే.

Read more:ఈ ఫోన్ ఖరీదు రూ.6.5 లక్షలు

ఐడియా..ఎంత మాట్లాడితే అంత కట్

భారతీ ఎయిర్ టెల్ ఇటువంటి ఆఫర్ ను ప్రకటించింది. పర్ మినిట్ లో ఉన్న యూజర్లు కాల్ మధ్యలోనే అంతరాయం ఏర్పడినప్పటికీ పూర్తిగా నిమిషానికి చార్జీ కట్టాల్సి వచ్చేది. తాజాగా సెకను ప్లానులో ఎన్ని సెకన్లు మాట్లాడితే అంతే సమయానికి మాత్రమే కట్టే వెసులుబాటు ఉంటుంది.

English summary
Here Write Idea’s all pre-paid users to pay on per second basis
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot