భారీగా తగ్గిన Idea 4జీ ఇంటర్నెట్ రేట్లు!

నమ్మశక్యం కాని ఆఫర్లతో విడదలకు ముందే ఉత్కంఠ రేపుతోన్న రిలియన్స్ జియో 4జీని తట్టుకునేందుకు ఇతర టెలికామ్ ఆపరేటర్లు ఇంటర్నెట్ రేట్లను భారీగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ బాటలోనే Idea కూడా 4జీ ఇంటర్నెట్ రేట్లను 45శాతానికి తగ్గించింది.

Read More : రూపాయికే Xiaomi ఫోన్లు

 భారీగా తగ్గిన Idea 4జీ ఇంటర్నెట్ రేట్లు!

4జీ, 3జీ ఇంకా 2జీ డేటా ప్యాక్స్ పై అదనపు ప్రయోజనాలను పొందే విధంగా ఆఫర్లను సవరించింది. తాజా రేట్లలో భాగంగా 1జీబి అంతకన్నా తక్కు సాచెట్స్ పై 45శాతం అదనపు డేటాను యూజర్లు పొందగలుగుతారు. 1జీబి పరిధిలో ఐడియా ఆఫర్ చేస్తోన్న 4జీ, 3జీ, 2జీ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లకు సంబంధించి రూ.8 నుంచి రూ.225 వరకు సాచెట్ డేటా ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి.

Read More : Moto E3 వచ్చేసింది!

 భారీగా తగ్గిన Idea 4జీ ఇంటర్నెట్ రేట్లు!

3 రోజుల వ్యాలిడిటీతో రూ.19కు లభిస్తోన్న 75 ఎంబి 2జీ డేటా ప్యాక్ పై ఇప్పుడు అదనంగా 35శాతం డేటా యాడ్ అవుతుంది. అంటే 110 ఎంబి అన్నమాట. అలానే 3 రోజుల వ్యాలిడిటీతో రూ.19కు లభిస్తోన్న 75 ఎంబి 3జీ/4జీ డేటా ప్యాక్ పై అదనంగా 38శాతం డేటా ఇప్పుడు జతవుతుంది. అంటే 38% శాతం అన్నమాట. సవరించబడిన డేటా ప్యాక్స్ అన్ని సర్కిళ్లలో జూలై 15 నుంచి అమలులోకి వచ్చినట్లు ఐడిలా సెల్యులార్ చీఫ్ మార్కెట్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు. పూర్తి వివరాలను Idea Cellular అధికారిక వెబ్‌సైట్‍‌లో చూడొచ్చు.

Read More : సామ్‌సంగ్ యూజర్లకు Reliance Jio ఉచితం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

మీ ప్రస్తుత మొబైల్ నెట్‌వర్క్ సిగ్నలింగ్ వ్యవస్థ లోపంతో విసుగెత్తిస్తుందా..?, కొత్త నెట్‌వర్క్‌లోకి మారుదామనుకుంటున్నారా..?, అయితే, మీ ప్రస్తుత నెంబర్‌తోనే కొత్త నెట్‌వర్క్‌లోకి మారిపోవచ్చు... ఇది ఏలా సాధ్యమనుకుంటున్నారా..?, ట్రాయ్ అమలు చేసిన మొబైల్ నంబర్ పోర్టబులిటీ విధానం ద్వారా కొత్త నెట్‌వర్క్‌లోకి మారినా పాత్ మొబైల్ నెంబర్‌తోనే కమ్యూనికేషన్ బంధాలను కొనసాగించవచ్చు.

పాత నెంబర్‌తోనే కొత్త నెట్‌వర్క్‌లోకి మారటం ఏలా..?

మీ మొబైల్ నెంబర్ నుంచి పోర్ట్ (port) అని టైప్ చేసి కొంత స్పేస్ ఇచ్చి బ్రాకెట్లో మీ మొబైట్ నెంబర్‌ని జత చేసి 1900కి ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఎనిమిది అంకెల యూనిక్ పోర్టింగ్ కోడ్ మీ మొబైల్‌కు సందేశం రూపంలో అందుతుంది.

ఈ పోర్ట్ కోడ్ ఆధారంగా

ఈ కోడ్ ఆధారంగా మీరు మారాలనుకుంటున్న నెట్‌వర్క్ ఆపరేట్‌ర్‌ను సంప్రదించి సంబంధిత అప్లికేషన్‌లను పూరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఇతర ధృవీకరణ ప్రతాలను సమర్పించాల్సి ఉంది.

మీ నుంచి రూ.19 వసూలు చేస్తారు

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ప్రక్రియలో భాగంగా మీ నుంచి రూ.19 వసూలు చేస్తారు. సిమ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. వారం రోజుల్లోపు మీ నెంబర్ కొత్త నెట్‌వర్క్‌లోకి యాక్టివేట్ అవుతుంది. పోర్టబులిటీ చేసుకోబోయే నెంబర్ తప్పనిసరిగా 90 రోజులకు మించి వాడకంలో ఉండాలనే నిబంధన ఉంది.

టెలికామ్ ఆపరేటర్లు వెంటనే స్పందింకపోతే

టెలికాం ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల మేరకు పసలేని కారణాలు చూపించి మొబైల్ నెంబర్ పోర్టబులిటీ అభ్యర్థనను తిరస్కరించిన సర్వీస్ ప్రొవైడర్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు అపరాధ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

 

ఫిర్యాదు చేయాల్సి వస్తే

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ)కి సంబంధించి ఫిర్యాదు చేయాల్సి వస్తే ముందుగా మీ సర్వీస్ ప్రొవైడర్‌కు సంబంధించి టోల్ ఫ్రీ కస్టమర్ సర్వీస్ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదును రిజిస్టర్ చేసుకోండి. వెంటనే సంబంధిత టెల్కో నుంచి ఫిర్యాదు నెంబర్, తేది, సమయంతో తదితర అంశాలతో కూడిన మెసేజ్ అందుతుంది. ఆ సందేశాన్ని భద్రపరుచుకోండి.

అప్పటికి స్పందించని పక్షంలో

సమస్య పరిష్కారం కాని పక్షంలో ఆ ఫిర్యాదు నెంబర్‌ను రుజువుగా చూపించి తదుపరి చర్యకు సన్నద్ధంకండి. మీ ఫిర్యాదుకు సంబంధించి సదరు టెల్కో స్పందించనట్లయితే అప్పీలు అధికారికి ఫిర్యాదు చేసుకునే అవకాశముంది.

అప్పీలేట్ అధికారికి విన్నవించండి

మీరు ఫిర్యాదు చేయాలనుకునే సర్వీస్ ప్రొవైడర్ అప్పిలేట్ అధికారి పూర్తి వివరాలు సంబంధిత వెబ్‌‌సైట్‌‌లో పేర్కొనబడతాయి. లేదా మీ సిమ్ కార్డు ద్వారా పొందిన బుక్‌లెట్‌లో పొందుపరచబడతాయి. మీ ఫిర్యాదు స్వీకరించిన అప్పీలేట్ అధికారి సమస్య పరిష్కారానికి కొంత సమయాన్ని అడుగుతారు. వారు పేర్కొన్న వివరాలను భద్రంగా ఉంచాలి.

టెలికాం శాఖకు ఫిర్యాదు చేయవచ్చు

అక్కడ కూడా మీ సమస్య ఓ కొలిక్కిరానట్లయితే అప్పీలేట్ అధికారి ఇచ్చిన వివరాలను రుజువులుగా పేర్కొంటు టెలికాం శాఖకు ఫిర్యాదు చేయవచ్చు.

ఫిర్యాదు అందాల్సిన చిరునామా

మీ సమస్యను పరిష్కరించటంలో అప్పీలేట్ అధికారి విఫలమైనట్లయితే నేరుగా సంబంధిత రుజువులతో ‘భారతదేశ ప్రభుత్వ టెలికాం శాఖ'(డాట్ )కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందాల్సిన చిరునామా : పబ్లిక్ గ్రీవెన్సెస్ సెల్, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్, రూమ్ నెం.518, సంచార్ భవన్, 20, ఆశోకా రోడ్, న్యూఢిల్లీ 110001

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Idea slashes Internet rates to offer up to 45% more on 4G, 3G and 2G Data packs!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot