ఐడియా స్మార్ట్ 3జీ వై-ఫై డాంగిల్@రూ.2,199

Posted By:

ఐడియా స్మార్ట్ 3జీ వై-ఫై డాంగిల్@రూ.2,199

భారత్‌లోని ప్రముఖ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకరైన ఐడియా 3జీ స్మార్ట్ వైఫై డాంగిల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ డాంగిల్ సహాయంతో గరిష్టంగా 21.6 ఎంబీపీఎస్ వేగంతో కూడిన ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ స్మార్ట్ వై-ఫై డాంగిల్‌లో ఏర్పాటు చేసిన హాట్ స్పాట్ ఫీచర్ ద్వారా డాంగిల్‌ను ఏకకాలంలో ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, గేమ్ ప్లేయర్, డిజిటల్ కెమెరా, మ్యూజిక్ ప్లేయర్ వంటి 10 పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చని ఇడియా సంస్థ తెలిపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఈ డాంగిల్ సహాయంతో డేటాను 21.6 ఎంబీపీఎస్ వేగంతో డౌన్‌లోడ్, 5.76 ఎంబీపీఎస్ వేగంతో అప్‌లోడ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ 3జీ వై-ఫై డాంగిల్ ధర రూ.2,199. ఈ డాంగిల్ పై రూ.250 నుంచి రూ.1250 విలువ చేసే
నెల వ్యాలిడిటీ పథకాలను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot