ఐడియా దూకుడు,రూ. 2 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్, పేమెంట్ బ్యాంకు షురూ..

Written By:

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం ఐడియా సరికొత్తగా వినియోగదారుల ముందుకు దూసుకొస్తోంది. అందులో భాగంగా టెలికా ఆపరేటర్‌ ఐడియా కొత్త క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. జియో, ఎయిర్‌టెల్‌ తరహాలో ఐడియా కూడా 4 జీ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి 2,000 రూపాయల క్యాష్ బ్యాక్ అందించనుంది. ఫిబ్రవరి 23 శుక్రవారం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఐడియా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఐడియా తన పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలను కూడా విస్తరిస్తోంది.

అదిరే ఆఫర్లతో షియోమి స్మార్ట్‌టీవీ అమ్మకాలు, ఫీచర్లు, ధర, మరిన్ని వివరాలు మీకోసం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రతినెలా రూ.199 ప్లాన్‌ రీఛార్జ్ చేసుకునే యూజర్లకు..

ప్రీపెయిడ్ , పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఐడియా కొత్త క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను తీసుకొచ్చింది. ప్రతినెలా రూ.199 ప్లాన్‌ రీఛార్జ్ చేసుకునే యూజర్లకు రెండు వేల రూపాయల వరకు ప్రయోజనాలను అందించనుంది. కాగా 4జీ హ్యాండ్సెట్స్‌ ద్వారా 4జీ నెట్‌వర్క్‌కి కస్టమర్ అప్‌ గ్రేడ్‌ చేయడమే తమ లక్ష్యమని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

మొదటి దఫాగా రూ. 750 క్యాష్‌బ్యాక్‌

ఇది మొదటి దఫాగా రూ. 750 క్యాష్‌బ్యాక్‌ మీకు వస్తుంది. మరో 18 నెలల రీచార్జ్‌ అనంతరం మరో 1,250 రూపాయల క్యాష్ బ్యాక్ కస్టమర్లకు అందిస్తుంది. పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లకు, అన్ని నిర్వాణ వాయిస్‌ కాంబో పధకాలకు ఈ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ వర్తిస్తుంది. 36 నెలల వ్యవధిలో రూ. 389 రీచార్జ్‌ ప్లాన్‌తో మొదలయ్యే ప్లాన్లపై ఆఫర్ ఏప్రిల్ 30, 2018 వరకు అందుబాటులో ఉంటుంది.

ఐడియా పేమెంట్స్ బ్యాంక్..

ఇదిలా ఉంటే ఆదిత్య బిర్లా సొంతమైన ఐడియా సెల్యూలర్ కు చెందిన ఐడియా పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు షురూ అయ్యాయి. దేశవ్యాప్తంగా తమ చెలింపుల బ్యాంకు ఆపరేషన్స్‌ మొదలయ్యాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

సుధాకర్ రామసుబ్రమణియన్‌ దీనికి సీఈవో

దీంతో ఈ సేవలను అందిస్తున్న ఇతర కంపెనీలు ఎయిర్‌టెల్‌, పేటీఎం, ఇండియా పోస్ట్ సరసన చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) 1949 లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 22 (1) ప్రకారం తమకు లైసెన్స్ జారీ అయిందని ప్రకటించింది. సుధాకర్ రామసుబ్రమణియన్‌ దీనికి సీఈవోగా వ్యవహరించనున్నారు.

ఈ బ్యాంకు అందించే వడ్డీ రేటు..

అయితే ఈ బ్యాంకు అందించే వడ్డీ రేటు,ఇ తర సేవల గురించి సమాచారం ఇంకా వెల్లడికాలేదు. కాగా చెల్లింపుల బ్యాంకు లైసెన్స్ కోసం .ఆదిత్య బిర్లా నువో భాగస్వామ్యంతో కంపెనీ 2015 లో దరఖాస్తు చేసుకుంది పేమెంట్‌ బ్యాంకు సేవల అనుమతికి దరఖాస్తు చేసుకున్న11 మందితో ఐడియా కూడా ఒకటి.

ఎయిర్‌టెల్‌, పేటీఎం పేమెంట్‌బ్యాంకు సేవల్లో..

ఇప్పటికే ఎయిర్‌టెల్‌, పేటీఎం పేమెంట్‌బ్యాంకు సేవల్లో దూసుకుపోతున్నాయి. మరోవైపు త్వరలో రిలయన్స్ జీయో తన చెల్లింపులు బ్యాంకును ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Idea Takes on Jio, Airtel By Offering Rs. 2,000 Cashback on All New 4G Smartphones More News At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot