ఐడియా సైలెంట్ ఆఫర్,రూ.109కే అపరిమిత కాల్స్, 1జిబి డేటా

By Hazarath
|

ఐడియా సైలెంట్ గా కొత్త ఆఫర్ ని ప్రకటించింది, ఎంట్రీ లెవల్ ప్లానుగా కంపెనీ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సర్కిల్ లో రూ.109కే ప్రీపెయిడ్ ప్లాన్ ఆవిష్కరించింది. కాగా ఈ ప్లాన్ కంపెనీ వెబ్‌సైట్లో అలాగే మై జియో అప్లికేషన్లో లిస్ట్ అయింది. కాగా ఇది ఓపెన్ మార్కెట్ ప్లాన్ అని కంపెనీ చెబుతోంది. ఈ ప్లాన్లో 14 రోజులు పాటు అపరిమిత కాల్స్, 1.జిబి డేటా, 100 ఎసెమ్మెస్ లు అందిస్తోంది. అయితే 28 రోజుల ప్లాన్ మాత్రం ఇందులో అవకాశం లేదన్నట్లు తెలుస్తోంది.కాగా రోజుకి 250 నిమిషాలు చొప్పున వారానికి 1000 నిమిషాలు వాడుకోవాల్సి ఉంటుంది. కాగా ఐడియా రూ. 93తో ఇదే రకమైన ప్లాన్ అందిస్తోంది. సేమ్ భెనిఫిట్లతో రూ.93లో ఉంటాయి. అయితే దాని వ్యాలిడిటీ మాత్రం 10 రోజులే ఉంటుంది.

 

బడ్జెట్ ధరకే 4జిబి ర్యామ్‌ నోకియా 6, ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..బడ్జెట్ ధరకే 4జిబి ర్యామ్‌ నోకియా 6, ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..

జియో రూ.98 ప్లాన్లో

జియో రూ.98 ప్లాన్లో

జియో రూ.98 ప్లాన్లో ఎటువంటి లిమిట్ లేకుండా అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది. అలాగే రోజుకు 300 ఎసెమ్మెస్ లు, 2జిబి 4జీ డేటాను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు.

 

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్

అలాగే ఎయిర్‌టెల్ రూ. 93 ప్లాన్ కూడా అందిస్తోంది. అయితే ఇది సెలక్ట్ అయిన యూజర్లకు మాత్రమే. ఈ ఫ్లాన్లో భాగంగా 1జిబి డేటా అపరిమిత కాల్స్, రోమింగ్ కాల్స్, 100 ఎసెమ్మెస్ లు యూజర్లకు 28 రోజుల పాటు లభిస్తాయి. అయితే ఎయిర్‌టెల్ ప్లాన్ అది కొద్దిమంది యూజర్లకే కాగా ఐడియా ఈ ప్లాన్ అందరికీ వర్తింపజేసింది. మీరు ఆంధ్ర, తెలంగాణా సర్కిల్స్ లో ఉన్నట్లయితే రూ.109 ప్లాన్ చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోగలరు.

ఐడియా రూ.109 కొత్త ప్యాక్‌
 

ఐడియా రూ.109 కొత్త ప్యాక్‌

ఐడియా రూ.109 కొత్త ప్యాక్‌ను 4జీ/3జీ అందించే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక సహా కొన్ని ప్రాంతాల్లోని వినియోగదారులు పొందవచ్చు. ప్రీపెయిడ్ వినియోగదారులు కొత్త రూ.109 ప్యాక్‌ను ఐడియా ఆపరేటర్ అధికారిక వెబ్‌సైట్ లేదా మై ఐడియా యాప్ ద్వారా రీచర్జ్ చేసుకోవచ్చు.

 గంట పాటు అపరిమిత ఇంటర్నెట్

గంట పాటు అపరిమిత ఇంటర్నెట్

కాగా గంట పాటు అపరిమిత ఇంటర్నెట్ అందించే దిశగా ఐడియా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే వొడాఫోన్ 16 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఒక గంట పాటు అపరిమిత ఇంటర్నెట్‌ను గంట పాటు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇప్పుడు ఐడియా కూడా ఇలాంటి ఆఫర్‌తోనే ముందుకొచ్చింది.

14 రూపాయలకే

14 రూపాయలకే

వొడాఫోన్ కంటే రెండు రూపాయల తక్కువ ధరకే, అంటే 14 రూపాయలకే ఒక గంట పాటు అపరిమిత డేటా ప్యాక్‌‌ను ప్రకటించింది. జనవరి 19 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఐడియాతో పాటు ఇతర కంపెనీలు కూడా ఈ ఒక గంట ప్యాక్స్‌ను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నాయి.

 పోస్ట్‌ పెయిడ్ కస్టమర్లకు

పోస్ట్‌ పెయిడ్ కస్టమర్లకు

ఐడియా తాజాగా తన పోస్ట్‌ పెయిడ్ కస్టమర్లకు పలు ప్లాన్లలో అందిస్తున్న బెనిఫిట్స్‌ లో మార్పులు చేసింది. ఇకపై ఐడియాలో రూ.499, రూ.649, రూ.999 పోస్ట్‌ పెయిడ్ ప్లాన్లను వాడే కస్టమర్లకు మరింత మొబైల్ డేటా ఉచితంగా లభిస్తుంది.

 రూ.499 ప్లాన్‌

రూ.499 ప్లాన్‌

ఇక రూ.499 ప్లాన్‌లో ఐడియా పోస్ట్‌ పెయిడ్ కస్టమర్లకు 40 జీబీ డేటా లభిస్తుంది. దీనికి గాను 200జీబీ వరకు డేటా రోల్ ఓవర్ బెనిఫిట్ వర్తిస్తుంది. అంటే ఏ నెలలో అయినా కస్టమర్ ఇచ్చిన మొబైల్ డేటా మొత్తాన్ని వాడుకోకపోతే అది మరుసటి నెలలో లభించే మొబైల్ డేటాకు యాడ్ అవుతుందన్నమాట. అలా గరిష్టంగా 200 జీబీ వరకు మొబైల్ డేటాను డేటా రోల్ ఓవర్ బెనిఫిట్ కింద ఈ ప్లాన్‌లో ఇస్తున్నారు. ఈ ప్లాన్‌లో గతంలో 30జీబీ డేటా మాత్రమే లభించేంది. ప్రస్తుతం దీన్ని 40జీబీకి పెంచారు.

రూ.649 ప్లాన్‌

రూ.649 ప్లాన్‌

ఇక రూ.649 ప్లాన్‌లో గతంలో 45 జీబీ మొబైల్ డేటా ఇవ్వగా ఇప్పుడు 50 జీబీ డేటాను అందిస్తున్నారు. దీనికి కూడా 200 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ పరిమితి విధించారు. ఇక రూ.999 ప్లాన్‌లో కస్టమర్లకు గతంలో 70 జీబీ డేటా లభించగా, ఇప్పుడు దీన్ని ఇంకా పెంచారు. దీంతో ప్రస్తుతం ఈ ప్లాన్ వాడే కస్టమర్లు 80 జీబీ డేటా పొందవచ్చు. దీనికి కూడా 200 జీబీ డేటా రోల్ ఓవర్ లిమిట్ ఉంది. ఇక ఈ ప్లాన్లు అన్నింటిలోనూ అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

Best Mobiles in India

English summary
Idea Cellular Silently Launches Rs 109 Prepaid Tariff Plan Offering Unlimited Calls and 1GB Data for 14 Days

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X