ఎయిర్‌టెల్‌కి పోటీగా ఐడియా రోజుకు 2జిబి డేటా ప్లాన్

Written By:

దేశీయ టెలికాం రంగంలో టారిఫ్ వార్ వేడెక్కుతున్న నేపథ్యంలో టెలికాం కంపెనీలు అన్నీ కొత్త బాట పట్టాయి. అత్యంత తక్కువ ధరకే టారిఫ్ లను ప్రకటిస్తూ వినియోగదారులు తమ నెట్ వర్క్ నుండి చేజారిపోకుండా కాపాడుకుంటున్నాయి. ఇందులో భాగంగా జియో, ఎయిర్‌టెల్‌ లు కొత్త ప్లాన్లను తీసుకురాగా వాటి సరసన ఇప్పుడు ఐడియా కూడా చేరింది. ఎయిర్‌టెల్‌ రూ.249 ప్యాక్‌కు పోటీగా ఐడియా సెల్యులార్‌ సరికొత్త ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఎయిర్‌టెల్‌ మాదిరి ప్రయోజనాలతో 249 రూపాయలతో ఐడియా ఈ కొత్త ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎయిర్‌టెల్‌కి పోటీగా ఐడియా రోజుకు 2జిబి డేటా ప్లాన్

ఈ ప్యాక్‌ కింద ఐడియా రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటాను, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను(రోమింగ్‌ కలిపి), అలాగే ఉచిత ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్యాక్‌ వాలిడిటీ 28 రోజులు. అంటే మొత్తంగా ఐడియా తన కస్టమర్లకు 56జీబీ డేటాను అందించనుంది. వాయిస్‌కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలను, వారానికి 1000 నిమిషాలను మాత్రమే వెసులుబాటును ఐడియా కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ ప్యాక్‌ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఎయిర్‌టెల్ రూ.249, రూ.349 ప్రిపెయిడ్ ప్లాన్ విశేషాలివిగో...

ఎయిర్‌టెల్‌ తాజాగా లాంచ్‌ చేసిన ఈ రూ.249 ప్యాక్‌లోనే ఐడియా మాదిరి ప్రయోజనాలనే లభిస్తున్నాయి. రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల పాటు ఆఫర్‌ చేస్తోంది. దీని వాలిడిటీ కూడా 28 రోజులే. రిలయన్స్‌ జియో ఇవే ప్రయోజనాలను రూ.198కే అందిస్తోంది. అయితే ఐడియా తన రూ.249 ప్యాక్‌పై రోజువారీ, వారం వారీ కాలింగ్‌ పరిమితులను విధించగా.. ఎయిర్‌టెల్‌, జియోలు మాత్రం ఎలాంటి పరిమితులు విధించకుండా అపరిమిత కాల్స్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి. వొడాఫోన్‌ కూడా వీటికి పోటీగా తన ప్యాక్‌ను తీసుకు రావాల్సి ఉంది. ఐడియా తన ప్రీపెయిడ్‌ యూజర్లు ఇటీవలే రోజుకు 5జీబీ డేటా అందించేలా రూ.998 ప్యాక్‌ను ప్రకటించింది.

English summary
Idea's Rs. 249 Prepaid Pack Offers 2GB Data Per Day to Take on Airtel and Jio More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot