Android & iOS ప్లే స్టోర్ ప్లాట్‌ఫారమ్‌లో నకిలీ యాప్ లను గుర్తించడం ఎలా?

|

గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో చాలా యాప్లు ఉన్నాయి. ఈ యాప్లు చాలావరకు వ్యక్తిగత ప్లాట్‌ఫారమ్‌లచే సమీక్షించబడుతున్నాయని చెబుతున్నప్పటికీ కొన్ని హానికరమైన యాప్లు ఇప్పటికీ ప్రవేశించగలుగుతున్నాయి. కఠినమైన 'డెవలపర్‌ల' ధృవీకరణ ప్రక్రియ కారణంగా ఆపిల్ యొక్క యాప్ పర్యావరణ వ్యవస్థ సురక్షితంగా పరిగణించబడుతున్నప్పటికీ ఇందులో కూడా ఇప్పటికీ నకిలీ యాప్లను కలిగి ఉంది. మొబైల్ వినియోగదారుల సంఖ్య పెరగడంతో స్కామర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రజలను మోసగించడానికి సులబంగా తమ యొక్క నకిలీ యాప్ లను ఎరగా తీసుకోస్తున్నారు. 150 కోట్లకు పైగా గల భారతీయులను మోసగించిన నకిలీ యాప్ల కుంభకోణంతో ఈ సమస్య ఇటీవల ప్రముఖంగా మారింది.

MLM

నివేదికల ప్రకారం ఫైనాన్సియల్ ఇన్వెస్ట్మెంట్ డబ్బుపై అధిక రాబడిని ఇస్తారని ప్రజలకు హామీ ఇచ్చే విధంగా అనేక ఫైనాన్సియల్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు జరిగాయి. సైబర్ సెల్ లింక్డ్ ఢిల్లీ పోలీసులు సిండికేట్ స్కామ్ ను గుర్తించగలిగారు. అలాగే ఈ హానికరమైన యాప్ లను చైనా పౌరులు మోసం కోసం మల్టీలెవల్ మార్కెటింగ్ (MLM) మోడల్‌ను ఉపయోగించి నడుపుతున్నారని వెల్లడించారు. సైబర్ క్రైమ్ సెల్ (CyPAD) డిప్యూటీ కమిషనర్ అన్యేష్ రాయ్ ఈ యాప్ లలో కొన్ని గూగుల్ ప్లే స్టోర్‌లో జాబితా చేయబడ్డారని మీడియా సమావేశంలో తెలిపారు. యాదృచ్చికంగా ప్రజలను సంప్రదించడానికి మరియు వివరాలను సేకరించడానికి క్రాస్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ముఖ్య వనరుగా తీసుకున్నారు. నకిలీ యాప్ల ఆన్‌లైన్ కుంభకోణానికి పాల్పడిన సైబర్‌క్రైమినల్స్‌ను అరెస్టు చేశారు. కానీ తలెత్తే ప్రశ్న టెక్ దిగ్గజాలు అందించే 'సమగ్ర' భద్రతా సేవలపై ఆధారపడాలా అని.

 

 

Apple TV యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లో సెటప్ చేయడం ఎలా?Apple TV యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లో సెటప్ చేయడం ఎలా?

నకిలీ యాప్లు

నకిలీ యాప్లు చట్టబద్ధమైన వాటిని అనుకరిస్తుండగా వాటిని వేరు చేయడం కష్టం అవుతుంది. కానీ అలాంటి హానికరమైన దాడులకు గురికాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు iOS మరియు Android ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ యాప్లను గుర్తించడంలో సహాయపడే కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించవచ్చు. ఈ నకిలీ యాప్ లను ఎలా గుర్తించాలో తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో నకిలీ యాప్ లను గుర్తించే విధానం

గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో నకిలీ యాప్ లను గుర్తించే విధానం

స్టెప్ 1: యాప్ స్టోర్‌లో యాప్ పేరును మరియు యాప్ ను ప్రచురించిన డెవలపర్‌లను తనిఖీ చేయండి.

స్టెప్ 2: యాప్ల కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు ఇలాంటి పేర్లతో అనేక యాప్ లను చూడవచ్చు. పేరు మరియు వివరణలోని స్పెల్లింగ్ తప్పుల వంటి లోపాలను గుర్తించడానికి ప్రయత్నించండి.

స్టెప్ 3: మీరు డౌన్‌లోడ్ చేయదలిచిన యాప్ల సమీక్షలు, రేటింగ్‌లు మరియు డౌన్‌లోడ్ గణనలను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్‌లో తనిఖీ చేయండి.

స్టెప్ 4: యాప్ యొక్క ప్రచురణ తేదీని ముందుగా చూడండి. నిజమైన యాప్ సాధారణంగా 'అప్ డేట్ చేసిన' తేదీని చూపుతుంది.

స్టెప్ 5: మీరు యాప్ యొక్క స్క్రీన్షాట్లను కూడా తనిఖీ చేయవచ్చు. ఉదాహరణకు వింతైన పదాలు మరియు ఫోటోలు యాప్ ను విశ్వసించాలా వద్దా అనే దాని గురించి మీకు మంచి ఆలోచన ఇస్తుంది.

స్టెప్ 6: పరిగణించవలసిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే యాప్ అడుగుతున్న అనుమతులు. మూడవ పార్టీ యాప్ లు సాధారణంగా కాంటాక్ట్ మరియు స్టోరేజ్ కు అనుమతి అడుగుతాయి. ఒక యాప్ కెమెరా, ఆడియో మరియు మరిన్నింటికి యాక్సిస్ కోసం అడుగుతుంటే కనుక వాటికీ అనుమతి ఇవ్వకుండా ఉండడం మంచిది.

 

Best Mobiles in India

English summary
Identify Fake Apps Guidelines on Android and iOS Play Store Platform

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X