డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టే సరికొత్త మెషిన్
ఈ రోజుల్లో ఎక్కడ చూసిన రోడ్ ప్రమాదాలు .రోజు ఏదో ఒక చోటా రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోకొట్టుకునేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది .
ఈ రోజుల్లో ఎక్కడ చూసిన రోడ్ ప్రమాదాలు .రోజు ఏదో ఒక చోటా రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోకొట్టుకునేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది .ముక్యంగా ఈ ప్రమాదాలు డ్రింక్ అండ్ డ్రైవ్ వల్లే జరుగుతుంది.అయితే దీనిని దృష్టిలో లో పెట్టుకొని బీహార్‌లోని భవానీపూర్‌నకు చెందిన ఐశ్వర్యప్రియ డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఒక కొత్త మెషిన్ ను కనిపెట్టారు. దీనిని ఫోర్‌వీలర్‌లో అమర్చడం ద్వారా డ్రింక్ చేసి వాహనం నడపడం సాధ్య పడదు. ఈ మెషిన్ ను కారులోని ఇంజన్‌కు అమర్చడం ద్వారా అది ఆల్కహాల్ వాసనను పసిగట్టి కారును ముందుకు కదలనివ్వకుండా చేస్తుంది.ఇంకా మందు కొట్టిన వ్యక్తి డ్రైవింగ్ సీట్ నుంచి కిందకి దిగేంత వరకు కార్ ఇంజిన్ స్టార్ట్ అవ్వకుండా చేస్తుంది.

పూణేలో జరిగిన ఒక పోటీలో....
ఐశ్వర్యప్రియ ప్రస్తుతం భోపాల్‌లోని లక్ష్మీనారాయన్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో బీటెక్ చదువుతున్నారు. ఈ నూతన ఆవిష్కరణను ఐశ్వర్య పూణేలో జరిగిన ఒక పోటీ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఆమె రూపొందించిన ఈ నూతన ఆవిష్కరణకు కాలేజీ ప్రొఫెసర్లు బాగా ప్రోత్సహించారు అని ఐశ్వర్య తెలిపింది.

ఆల్కహాల్ డిటెక్టర్ అండ్ ఆటోమేటిక్ ఇంజిన్ లాకింగ్ సిస్టమ్’ అని పేరుపెట్టారు.....
కాగా ఈ నూతన ప్రాజెక్టుకు ‘ఆల్కహాల్ డిటెక్టర్ అండ్ ఆటోమేటిక్ ఇంజిన్ లాకింగ్ సిస్టమ్' అని పేరుపెట్టారు దీనిని రూపొందించిన ఐశ్వర్యప్రియ.

కారులో అమర్చేందుకు కేవలం రూ. 900....
ఈ మెషిన్ ను కారులో అమర్చేందుకు అయ్యే ఖర్చు కేవలం రూ. 900 అని ఐశ్వర్య తెలిపారు.ఈ మెషిన్ ను అమర్చేందుకు కారులో చిన్నపాటిప్లేస్ సరిపోతుందని దీనిని డాష్ బోర్డు వద్ద కూడా ఉంచవచ్చుని ఐశ్వర్య తెలిపారు .ఈ మెషిన్ కు లింక్ చేసిన ఒకవైరు కారు బ్యాటరీకి, మరోవైరు కారు ఇంజన్‌కు అమర్చాల్సి ఉంటుంది. దీంతో అది పనిచేయడం ప్రారంభిస్తుంది.

మెషిన్ శ్వాసను పసిగట్టి....
కారు నడిపే వ్యక్తి డ్రింక్ చేసి ఉంటే ఈ మెషిన్ అతని శ్వాసను పసిగట్టి ఇంజన్ స్టార్ట్ అవకుండా చేస్తుంది. దీంతో డ్రింక్ చేయని వ్యక్తి మాత్రమే కారు నడపగల వీలు ఉంటుంది.ఇది రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది.


Click it and Unblock the Notifications








