ఈ యాప్స్ చూస్తే మీ లాస్ట్ శృంగారం వివరాలు FBలో తెలిసిపోతాయట

By Gizbot Bureau
|

మీ బెస్ట్ ఫ్రెండ్ లాస్ట్ శృంగారంలో ఎప్పుడు పాల్గొన్నాడో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమైనా యాప్స్ ఉన్నాయా అని వెతుకుతున్నారా.. అయితే మీరు ఇప్పుడు వాటి గురించి Facebook ద్వారా తెలుసుకోవచ్చట. Facebook ఈ విషయాలను ఇట్టే చెబుతుందట.. నమ్మలేకున్నారా..ఈ న్యూస్ చదివితే నమ్మి తీరాల్సిందే మరి. మీరు two menstruation-tracking apps ద్వారా ఈ విషయాలను తెలుసుకోవచ్చు. Maya and MIA Fem అనే యాప్స్ ఈ విషయాలను ఫేస్ బుక్ లో షేర్ చేస్తున్నాయి. యూజర్ల వ్యక్తిగత సమాచారం అయిన ఆరోగ్యం, అలాగే సెక్స్ ఇంకా ఇతర పర్సనల్ విషయాలను ఈ యాప్స్ బయటపెట్టేస్తున్నాయి. బ్రిటన్ బేస్ డ్ వాచ్ డాగ్ రిపోర్ట్ ఈ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది.

సెల్ఫ్ రికార్డ్ 
 

సెల్ఫ్ రికార్డ్ 

ఈ యాప్స్ సహయంతో యూజర్లకు సంబంధించిన సెల్ఫ్ రికార్డ వివరాలను అన్ని బయటకు వస్తున్నాయి. ఇందులో మీరు మీ భాగస్వామితో చివరిగా ఎప్పుడు సెక్స్ లో పాల్గొన్నారు. మహిళలు అయితే ఆ సమయంలో గర్భం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ సమయంలో వారి మూడ్ ఎలా ఉంది. బాగా ఎంజాయ్ చేశారా లేదా డల్ అయ్యారా లాంటి విషయాలు లీకయ్యాయని రిపోర్ట్ తెలిపింది.

ఏజ్ ల వారీగా టార్గెట్ 

ఏజ్ ల వారీగా టార్గెట్ 

ఈ లీకయిన వివరాలు వయస్సును బట్టి ఉన్నాయి. అలాగే అనేక రకాలైన సెక్యూరిటీ ప్రశ్నలు కూడా ఇందులో లీకయ్యాయి. ఫలానా కేటగిరి కింద ఉన్న యూజర్స్ ని టార్గెట్ చేసుకుని వారి పర్సనల్ ఛాట్ సమాచారం మొత్తాన్ని ఈ రెండు యాప్స్ లీక్ చేశాయని రిపోర్ట్ తెలిపింది. వారి వ్యక్తిగత సమాచారం అంటే సెక్స్ రిలేటెడ్ అంశాలు, అలాగే మూడ్ ఎలా ఉందనే అంశాలు, ఎవరితో చేశారనే విషయాలు ఇందులో బహిర్గతం అయ్యాయి.

యాప్ ఇన్ స్టాల్

యాప్ ఇన్ స్టాల్

యాప్ ఇన్ స్టాల్ చేయగానే ఆటోమేటిగ్గా సమాచారం అంతా తస్కరణకు గురి అవుతుందని తెలుస్తోంది. ఈ సమాచారమంతా Facebookలోకి వెళ్లిపోతోంది. Maya and MIA యాప్స్ డేటాను షేర్ చేయడంలో చాలా ముందున్నాయని వీటికి యూజర్ల భద్రత పట్టలేదని లీకయిన సమాచారంను బట్టి తెలుస్తోంది. మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయాలని నిపుణులు కోరుతున్నారు.

ఆన్ లైన్ లో ఏం సెర్చ్ చేస్తున్నారు 
 

ఆన్ లైన్ లో ఏం సెర్చ్ చేస్తున్నారు 

దీంతో పాటుగా ప్రెగ్నెంట్ సమయంలో మహిళలు చేస్తున్న షాపింగ్ వివరాలు, అలాగే ఎవ్వరికీ తెలియకుండా వారు చేస్తున్న పనులు ఇలాంటి సున్నితమైన అంశాలు అన్నీ లీకయ్యాయి. ఈ సమాచారం మొత్తాన్ని ఈ యాప్స్ ధర్డ్ పార్టీకి అమ్మేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, వారు ఆన్ లైన్ లో ఏం సెర్చ్ చేస్తున్నారు ఇలాంటి విషయాలు బయటకు రావడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.

వారు ఏం చెబుతున్నారు

వారు ఏం చెబుతున్నారు

అయితే దీనిపై ఫేస్ బుక్ టీం స్పందిస్తూ ఈ డేటాకు అత్యంత భధ్రత ఉందని. వారి వ్యక్తిగత సమాచారానికి ఎటువంటి భంగం వాటిల్లలేదని చెబుతోంది. టెక్నికల్ గా ఏదైనా సమస్య ఉందేమో చూస్తున్నామని తెలిపారు. ఈ డేటా ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతుందని కొత్త వెర్షన్ ద్వారా Facebook Software Development Kit సహాయంతో ఈ డేటాను రిమూవ్ చేశామని చెబుతున్నారు. ఈ డేటాకు సంబంధించి ఈ యాప్ ప్రతినిధులను వివరణ కోరతామని ఫేస్ బుక్ తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
These Apps Might Have Informed Facebook about your online searches.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X