స్మార్ట్‌టీవీ ప్రపంచానికి షాకిచ్చిన TCL,అదిరే ఫీచర్లతో iFFALCON 75H2A

|

దేశంలో స్మార్ట్ టీవీ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. దిగ్గజ కంపెనీలు బడ్జెట్, ప్రీమియం ధరల్లో తమ స్మార్ట్ టీవీలను తీసుకొస్తున్నాయి. ఈ ధరల్లోని టీవీలకు అత్యాధునిక ఫీచర్లను అందిస్తూ భారీ అమ్మకాలతో కోట్ల లాభాలను గడిస్తున్నాయి. వీటిల్లో మనం ముందుగా TCL గురించి చెప్పుకోవాలి. స్మార్ట్‌టీవీ మార్కెట్లోకి వచ్చిన అత్యంత తక్కువ కాలంలోనే వినియోగదారులను విపరీతంగా ఆకర్షించింది. iFFALCON బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ టీవీలు అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. ఇదే ఊపులో కంపెనీ మరో సంచలనానికి తెరలేపింది. iFFALCON 75H2A పేరుతో 75 ఇంచ్ ఆల్ట్రా హెచ్ డి 4కె ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీలను ఆఫర్ చేస్తోంది. దీని ధర రూ 1,64,999గా ఉంది. ప్రీమియం ధర అయినప్పటికీ దానికి తగ్గట్లుగానే ఫీచర్లు కూడా దుమ్మురేపుతున్నాయి. దీని ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

నమ్మశక్యంకాని పిక్చర్ క్వాలిటీ
 

నమ్మశక్యంకాని పిక్చర్ క్వాలిటీ

iFFALCON 75H2A 75-inch UHD Android TV వారాంతపు సమయాల్లో మీకు అదిరిపోయే అనుభూతిని ఇవ్వనుంది. ప్రీమియం ఫీచర్లతో వీక్షకులకు మంచి వ్యూయింగ్ అనుభూతిని అందించనుంది. 75 ఇంచ్ డిస్ ప్లేతో పాటు 3840 x2160 ఫిక్సల్ రిజల్యూషన్ ని ఇది ఆఫర్ చేస్తోంది. ఈ రిజల్యూషన్ ద్వారా మీరు ఫిక్చర్ క్వాలిటీని ఉన్నది ఉన్నట్లుగా వీక్షించవచ్చు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే 2కె టెక్నాలజీలో తీసిన చిత్రాలు కూడా ఇందులో 4కెలో కనిపిస్తాయి.Wide Color Gamut Technologyతో రావడం వల్ల గ్రేట్ క్వాలిటీని ఈ టీవీ ఆఫర్ చేస్తుంది. MEMC 120Hz టెక్నాలజీతో ఈ టీవీ రావడం వల్ల వీక్షకులు గేమింగ్ లో కాని సినిమాలు చూడటంలో కాని ఎటువంటి రాజీ పడకుండా అద్భుతమైన వ్యూయింగ్ అనుభూతిని పొందవచ్చు. వివిడ్ క్వాలిటీని ఈ టీవీ ఆఫర్ చేస్తోంది.

ఆడియో అనుభూతి

ఆడియో అనుభూతి

ఈ స్మార్ట్ టీవీ హై క్లాస్ ఆడియో అనుభూతిని అందిస్తోంది. Harman Kardon high-class sound systemతో రావడం వల్ల వీక్షకులు సినిమాటిక్ ఆడియో క్వాలిటీతో కార్యక్రమాలను వీక్షించవచ్చు. ముందు భాగంలో 4 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ పొందుపరచడం వల్ల ఆడియో అనుభూతి మరింతగా ఆస్వాదించే అవకాశం ఉంది. Dolby Digital and DTS వంటి సౌండ్ ని ఆఫర్ చేస్తోంది.

గూగుల్ సర్టిఫైడ్
 

గూగుల్ సర్టిఫైడ్

iFFALCON 75H2A గూగుల్ సర్టిఫైడ్ స్మార్ట్ టీవీ. గూగుల్ నుంచి వచ్చే అన్నీ యాప్స్ ఇందులో ఫ్రీగా లోడ్ చేయబడి ఉంటాయి. యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్ వంటివి టీవీతోనే ఇన్ స్టాల్ అయి వస్తాయి. ఆండ్రాయిడ్ 7.0 మీద ఈ టీవీ ఆపరేట్ చేయవచ్చు. అయితే కంపెనీ దీనికి లేటెస్ట్ వర్షన్ కి అప్ గ్రేడ్ అయ్యే సౌకర్యాన్ని కూడా కల్పించింది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మీకు నచ్చిన యాప్స్ ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని టీవీలో వీక్షించవచ్చు. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు,మ్యూజిక్ వినవచ్చు.ఇంకా ఆసక్తికర ఫీచర్ ఏంటంటే దీనికి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ని కల్పించారు. ఇంగ్లీష్ తో పాటు ఇతర రీజనల్ భాషలు Hindi, Tamil, Telugu, Kannada, Malayalam, Marathi అలాగే ఇతర భాషల్లో కూడా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ పనిచేయనుంది. Hotstar, Sun NXT, ZEE5 వంటి యాప్స్ కూడా ఇందులో ఉన్నాయి. రిమోట్ కంట్రోల ద్వారా వీటిని ఆపరేట్ చేయవచ్చు. హార్డ్ వేర్ విషయానికొస్తే quad-core CPU and dual-core GPUతో పాటు 2.5 జిబి ర్యామ్ ని ఇందులో పొందుపరిచారు. 16జిబి స్టోరేజ్ వరకు వాడుకునే అవకాశాన్ని కల్పించారు.

డిజైన్

డిజైన్

iFFALCON 75H2A టీవీ ప్రీమియం మెటాలిక్ బెజిల్ లెస్ డిజైన్ తో అందుబాటులోకి వచ్చింది. పుల్ మెటాలిక్ డిజైన్ తో రావడం వల్ల చూసేవారికి మంచి ఫ్రెష్ నెస్ లుక్ ని ఈ టీవి అందిస్తుంది.మీ లివింట్ రూమ్ ఈ టీవీ ద్వారా మరింత అందంగా కనిపిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

వైడ్ కనెక్టివిటీ

వైడ్ కనెక్టివిటీ

iFFALCON 75H2A టీవీ వైడ్ రేంజ్ కనెక్టివిటీ యాప్స్ తో వచ్చింది. 3 HDMI ports and 2 USB portsతో రావడం వల్ల గేమింగ్ కి మీరు ఈజీగా కనెక్ట్ కావచ్చు. అలాగే కీబోర్డ్ మౌస్ స్టోరేజ్ డివైస్ వంటి వాటిని కూడా సెట్ చేసుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ టీవీ ముందు కూర్చున్న వీక్షకులకు సినిమా ధీయేటర్లో సినిమా చూస్తున్న అనుభూతిని కల్పిస్తోంది. ధీయేటర్ సౌండ్ క్వాలిటీని మీకు అందిస్తుంది. అయితే ప్రీమియం ధరలో రావడం వల్ల కంపెనీ దానికి తగ్గట్లుగానే ఫీచర్లను అందించింది.కాబట్టి యూజర్లకు ఎటువంటి నిరాశ కలగదని కంపెన భరోసా ఇస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
iFFALCON 75H2A raises the bar for Android TVs with impressive features more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more