Home
News

ఐఐటీ గ్రాడ్యుయేట్ AI సృష్టి.. రొట్టెలు గుండ్రంగా ఉన్నాయో లేదో సెకన్లలో చెప్పేస్తున్న టూల్!

RotiChecker AI: ఇటీవల ఐఐటీ ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఒకరు సరికొత్త టెక్నాలజీని కనిపెట్టారు. అదేంటంటే, రొట్టెలు గుండ్రంగా ఉన్నాయా లేదా అని చెప్పే AI టూల్. దీని పేరు 'రోటీచెకర్ డాట్ ఏఐ' (RotiChecker.ai). ఈ టూల్ పుణ్యమా అని ఇప్పుడు నెట్టింట దీని గురించే మాట్లాడుకుంటున్నారు. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, ఒక మహిళ తన చేత్తో చేసిన గుండ్రటి రొట్టె ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది.

"గుండ్రటి రొట్టె చేయడం కూడా ఒక కళ" అని క్యాప్షన్ పెట్టింది. దీనికి స్పందిస్తూ, అనిమేష్ చౌహాన్ అనే బెంగళూరు-బేస్డ్ టెకీ తన AI టూల్‌ను పరిచయం చేశారు. ఆ రొట్టె ఫొటోను రోటీచెకర్ డాట్ ఏఐలో అప్‌లోడ్ చేసి, దాని గుండ్రత్వాన్ని పరీక్షించారు. ఆ టూల్ ఆ రొట్టెకు 100కి 91 మార్కులు వేసింది.

IIT Bengaluru Alum Develops AI Tool to Check Chapati Roundness  Internet Reacts

* AI టూల్ వైరల్

మొదటగా చౌహాన్ సరదాగా ఒక ఛాలెంజ్ విసిరారు. "ఈ పోస్ట్‌కు 420 లైకులు వస్తే, రోటీచెకర్ డాట్ ఏఐని అందరికీ అందుబాటులోకి తెస్తాను." అని ప్రకటించారు. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఈ టూల్ ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయింది. చాలామంది గూగుల్‌లో "రొట్టె మేకర్" అని తెగ వెతకడం మొదలుపెట్టారు.

ఇక్కడితో ఆగలేదు. రోటీచెకర్ డాట్ ఏఐ స్ఫూర్తితో, నెటిజన్లు రకరకాల AI టూల్స్‌ను సజెస్ట్ చేయడం మొదలుపెట్టారు. "దోశ చెకర్", "చాయ్ కలర్ చెకర్" అంటూ సరదాగా కామెంట్లు పెట్టారు. కొందరికి ఈ ఆలోచన నవ్వు తెప్పిస్తే, మరికొందరు దీని వల్ల ఉపయోగం ఏముందని ప్రశ్నించారు.

* సరదాగా మొదలై బిజినెస్ ఐడియాగా మారిన టూల్

చౌహాన్ ఈ AI టూల్‌ను కేవలం సరదా కోసమే తయారు చేశానని చెప్పారు. కానీ, ఇంత రెస్పాన్స్ రావడంతో, దీన్ని బిజినెస్‌గా మార్చే ఆలోచనలో పడ్డారు. "ఈ డొమైన్ నేమ్‌ను కొనడానికి ఇన్వెస్టర్ కోసం చూస్తున్నా. 10% ఈక్విటీ ఇస్తాను. చేతులు కలుపుదాం రండి." అని పోస్ట్ పెట్టారు.

అంతేకాదు, స్టార్టప్ ఇంక్యుబేటర్ వై కాంబినేటర్‌కు కూడా అప్లై చేస్తానని జోక్ చేశారు. ఆ తర్వాత, చాలామంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారని, ఇది "అతి తక్కువ సమయంలో సంపాదించిన డబ్బు" అని సరదాగా అన్నారు. ఆయన వెబ్‌సైట్ ట్యాగ్‌లైన్ కూడా చాలా ఫన్నీగా ఉంది.

"రోటీచెకర్ డాట్ ఏఐ – డౌ ఆర్ డై: ది గ్రేట్ గోల్ రోటీ ఛాలెంజ్. త్వరలో మీ ముందుకు." అనేది ఆ ఫన్నీ ట్యాగ్‌లైన్. ఈ AI టూల్‌కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు ఈ కొత్త ఆలోచనను మెచ్చుకుంటే, మరికొందరు దీని ఆచరణాత్మకతను ప్రశ్నించారు.

* నెటిజన్ల రియాక్షన్స్

ఒక యూజర్ వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ, "అమెరికా దగ్గర చాట్‌జీపీటీ ఉంది, చైనా దగ్గర డీప్‌సీక్ ఉంది, మన దగ్గర రోటీచెకర్ డాట్ ఏఐ ఉంది" అన్నారు. ఇంకొకరు రొట్టె రుచిగా ఉండాలంటే మందం కూడా ముఖ్యమని గుర్తుచేశారు. "మందాన్ని ఎవరు చెక్ చేస్తారు? అది టేస్ట్ కోసం చాలా ముఖ్యం." అని కామెంట్ పెట్టారు.

* మహిళలపై ద్వేషం..

కొందరు ఈ AI టూల్ మహిళల వంట నైపుణ్యాలను జడ్జ్ చేయడానికి పెట్టినట్టు ఉందని, ఇది మిసోజినీ (స్త్రీద్వేషం) అని ఆరోపించారు. అయితే చౌహాన్ ఈ ఆరోపణలను ఖండించారు. "ఈ ప్లాట్‌ఫాం కేవలం మహిళల కోసమేనని ఎవరు చెప్పారు? మీరు అలా అనుకుంటే అది మీ మిసోజినీని చూపిస్తుంది, నాది కాదు" అని స్పష్టం చేశారు.

తన వాదనను సమర్థించుకోవడానికి, పురుషులు కూడా తమ రొట్టెలను చెక్ చేసుకోవడానికి ఈ టూల్‌ను ఉపయోగించిన పోస్టులను షేర్ చేశారు. ఏదేమైనా, ఈ AI టూల్ మాత్రం సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఇది నిజంగా ప్రొడక్ట్‌గా మారుతుందో లేదో తెలియదు కానీ, నెటిజన్లకు మాత్రం మంచి వినోదాన్ని పంచిందనడంలో సందేహం లేదు.

Best Mobiles in India

English summary
IIT grad Animesh Chouhan's RotiChecker.ai, an AI tool for chapati roundness, went viral, sparking amusement, criticism, and misogyny claims. Initially a joke, it’s now attracting investor interest.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X