AI-టెక్నాలజీ కోసం కొత్త రకం చిప్‌లను కనుగొన్న IIT-Hyderabad

|

ప్రపంచం మొత్తం స్మార్ట్ టెక్నాలజీ మీద ఆధారపడి అభివృద్ధి చెందుతోంది. ఈ అభివృద్ధిని మరింత పెంచడానికి ఐఐటి హైదరాబాద్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- హైదరాబాద్ పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీలో ఒక అడుగు ముందుకు వేసారు.

పవర్ చిప్‌
 

ఇప్పుడు వీరు తక్కువ విద్యుత్ సహాయంతో పనిచేసే కోతరకమైన పవర్ చిప్‌లను అభివృద్ధి చేశారు. ఈ పవర్ చిప్‌లు విద్యుత్ ను తక్కువగా తీసుకొని ఎక్కువ సేపు పనిచేస్తాయి అంటే తక్కువ బ్యాటరీ ఉన్నపుడు కూడా డివైస్ లను ఎక్కువ సేపు ఉపయోగించవచ్చు.

అమెజాన్ దీపావళి సేల్స్: RS.999కే ఇంటిని కలర్ లైట్లతో నింపవచ్చుఅమెజాన్ దీపావళి సేల్స్: RS.999కే ఇంటిని కలర్ లైట్లతో నింపవచ్చు

స్మార్ట్ డివైస్

ప్రస్తుత కాలంలో ఉన్న అన్ని రకాల స్మార్ట్ డివైస్ లు మరియు అధిక డేటాను ప్రసారం చేసే కంప్యూటర్లు వంటి ఎక్కువగా ఫేస్ లాక్,వాయిస్ కమాండ్ మరియు ఫింగర్ ప్రింట్ స్కాన్ ను ఉపయోగించి వాటిని భద్రంగా ఉంచుతారు. ఇటువంటి వాటిని ప్రతి సారి ఓపెన్ చేయడానికి దీనికి చాలా శక్తి అవసరం. పెద్ద పెద్ద డేటాను ప్రాసెస్ చేయడంలో మరియు నిల్వ చేయడంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి అధిక పనితీరు గల కంప్యూటింగ్ డేటా సెంటర్ల అవసరం వేగంగా పెరుగుతోంది.

దీపావళి సేల్స్ లో షియోమి వస్తువులకు ఎక్కడ అధిక డిస్కౌంట్ లభిస్తున్నదిదీపావళి సేల్స్ లో షియోమి వస్తువులకు ఎక్కడ అధిక డిస్కౌంట్ లభిస్తున్నది

ఐఐటి హైదరాబాద్

నానో అయస్కాంతాలను ఉపయోగించి ఐఐటి హైదరాబాద్ (IIT-H) తక్కువ విద్యుత్ సరఫరాతో AI పరికరాల్లో స్టోరేజ్ మరియు పంపిణి చేయగల మాగ్నెటిక్ క్వాంటం-డాట్ సెల్యులార్ ఆటోమాటా-ఆధారిత మరియు తక్కువ శక్తితో పనిచేసే చిప్‌ను అభివృద్ధి చేసింది. చిప్ యొక్క ఎక్కువ శక్తి సామర్థ్యం కోసం అతి తక్కువ శక్తిని వినియోగిస్తుంది.

ప్రాసెసింగ్
 

ప్రస్తుత సిలికాన్ వ్యవస్థలో ప్రాసెసింగ్ కోసం డేటాను డివైస్ కు పంపిణీ చేయడానికి ముందు మొదటగా క్లౌడ్‌కు ప్రసారం చేయబడుతుంది. ఇటువంటి సందర్భంలో ఇది ప్రాసెస్ అవ్వడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. దీనికి ప్రత్యాన్మాయంగా తక్కువ మరియు పరిమిత విద్యుత్ తో పని చేసే చిప్‌ను అభివృద్ధి చేయాలని మేము ఉహించాము అని ఐఐటి-హెచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అడ్వాన్స్‌డ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఐసి డిజైన్ లాబొరేటరీ పరిశోధనా పండితుడు సంతోష్ శివసుబ్రమణి అన్నారు.

అధిక డేటా వినియోగదారులకు ఎయిర్‌టెల్ గ్రేట్ న్యూస్.... రోజుకు 3GB డేటాఅధిక డేటా వినియోగదారులకు ఎయిర్‌టెల్ గ్రేట్ న్యూస్.... రోజుకు 3GB డేటా

AI కంప్యూటింగ్‌

పరిశోధకులు సుమారుగా నానో అయస్కాంతం అంచుతో AI కంప్యూటింగ్‌ను ఉపయోగించారు. నానో మాగ్నెటిక్ కంప్యూటింగ్ అంటే అప్లికేషన్ ఖచ్చితత్వంతో కొద్దిగా రాజీపడగలదు కాని తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుంది. తుది ఫలితాలు 100 శాతం కాకపోయినా కంప్యూటింగ్ సామర్థ్యంగా ఉండాలి అని శివసుబ్రమణి అన్నారు.

ECG

ఐఐటి-హైదరాబాద్ పరిశోధకులు అభివృద్ధి చేసిన తక్కువ-శక్తి చిప్‌ను స్వయంప్రతిపత్తమైన డ్రైవింగ్ వాహనాలు, వ్యవసాయ రంగాలలో ఉపయోగించే డ్రోన్లు, సెన్సారీ డేటా, రిమోట్ సెర్వైలెన్స్ ,హ్యూమన్ మోనిటరింగ్ (మానవ పర్యవేక్షణ), డేటా ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉన్న ECG లో ఉపయోగించవచ్చు.

ఐఐటి

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) హైదరాబాద్ పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్ల యొక్క అంతర్గత పనితీరును అర్థం చేసుకునే ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు . ఇది కృత్రిమ నాడీ నెట్‌వర్క్‌లు లేదా ANN ను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇవి AI నమూనాలు మరియు మానవ మెదడు యొక్క పనిని అనుకరించే ప్రోగ్రామ్‌లు. తద్వారా యంత్రాలు మరింత ఎక్కువగా మానవ తరహాలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
IIT-Hyderabad Researchers Design Low Power Chip For AI Smart Devices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X