Home
News

తెలంగాణ బిడ్డకు రూ.1.2 కోట్ల వార్షిక వేతనం ఆఫర్ చేస్తున్న గూగుల్

By Anil

పట్టుదల ఉంటె ఏదైన సాధించవచ్చు అని మరో సారి నిరూపించింది వికారాబాద్‌కు చెందిన స్నేహారెడ్డి. దేశవ్యాప్తంగా గూగుల్ నిర్వహించిన క్యాంపస్ ప్లేసెమెంట్స్ లో ఐదుగురు ప్రతిభావంతులు సెలెక్ట్ కాగా అందులో స్నేహారెడ్డి కూడా ఒకరిగా నిలిచింది . వీరి ఒక్కొక్కరికీ రూ.1.2 కోట్ల వార్షిక వేతనం గూగుల్ ఆఫర్ చేసింది .ఈ ఐదుగురిలో ఓ తెలుగుమ్మాయికి కూడా చోటు దక్కడం గొప్ప విశేషం.పూర్తి వివరాల్లోకి వెళ్తే....

వికారాబాద్‌కు చెందిన స్నేహారెడ్డి......

వికారాబాద్‌కు చెందిన స్నేహారెడ్డి......

వికారాబాద్‌కు చెందిన స్నేహారెడ్డి ఐఐటీ హైదరాబాద్‌ నుంచికంప్యూటర్ సైన్స్‌లో ఇటీవలే బీటెక్‌ పూర్తి చేశారు. చదువుతోపాటు మిగతా విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన స్నేహా స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ సైతం అందుకున్నారు.

Artificial Intelligence పై  చేస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో......

Artificial Intelligence పై చేస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో......

Artificial Intelligence పై చేస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో గూగుల్ సంస్థ స్నేహారెడ్డిని సెలెక్ట్ చేసింది.

"నేచురల్‌ లాంగ్వేజ్‌ అండర్‌‌స్టాండింగ్‌" ప్రాజెక్టు కోసం .....

Artificial Intelligence లో భాగమైన ‘నేచురల్‌ లాంగ్వేజ్‌ అండర్‌‌స్టాండింగ్‌' ప్రాజెక్టు కోసం గూగుల్‌ సంస్థ ప్రతిభావంతులను సెలెక్ట్ చేయడానికి అన్వేషణ ప్రారంభించింది. దీనికి ఆన్‌లైన్‌ ద్వారా ఎంపిక నిర్వహించింది.

నాలుగు రౌండ్లను విజయవంతంగా......

నాలుగు రౌండ్లను విజయవంతంగా......

ఇందులో స్నేహారెడ్డి కూడా పాల్గొని తొలి నాలుగు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేశారు. పేస్ టు పేస్ రౌండ్ కోసం అమెరికాకు వెళ్లాల్సి ఉండగా మరో ముఖ్యమైన పరీక్ష ఉండటంతో హాజరు కాలేకపోయింది . అయితే, ఆమె ప్రతిభను గుర్తించిన గూగుల్ ఫైనల్ రౌండ్ ను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించి సెలెక్ట్ చేసింది.

ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే .....

ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే .....

ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక వేతనం తో ఉద్యోగం పొందిన విద్యార్థిగా స్నేహారెడ్డి గుర్తింపు దక్కించుకున్నారు. విద్యార్థులను పరిశోధనల దిశగా ఐఐటీ అధ్యాపకులు ప్రోత్సహించడం వల్లే తనకు ఈ ఆఫర్ వచ్చిందని , బీటెక్‌ చదువుతున్నప్పుడే అమెరికాకు చెందిన ప్రఖ్యాత పరిశోధన సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం కూడా దక్కిందని ఆమె అన్నారు.

 

 

Best Mobiles in India

English summary
IIT-Hyderabad student bags Rs 1.2-crore package with Google.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X