Home
News

జుగల్‌బందీ చాట్‌బోట్‌ కోసం విన్నారా.. వాట్సాప్‌ మెసేజ్‌ చేస్తే చాలు..!

భారత్‌లోని రైతులకు మేలు చేసేలా వినూత్న ఆవిష్కరణలో మైక్రోసాఫ్ట్‌ భాగం అయింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాసులో AI4భారత్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ను రూపొందించింది. జుగల్‌బందీ పేరిట రూపొందించిన ఈ చాట్‌బోట్‌ వివిధ భాషల్లో వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు. ప్రశ్నలు అడిగినా లేదా ప్రశ్నలను టైప్‌ చేసి ఇచ్చినా సమాధానం ఇస్తుంది.

వివిధ ప్రభుత్వ పథకాలపైన ఇంగ్లీష్‌లో సమాచారం సేకరిస్తుంది. అనంతరం స్థానిక భాషల్లో సమాధానం ఇస్తుంది. ప్రస్తుతం జుగల్‌బందీ చాట్‌బోట్‌ కొత్తగా రూపొందించబడినా.. ఏదో రోజు కచ్చితంగా భారతీయులందరికీ తన స్థానిక భాషల్లో ఫోన్‌ ద్వారా సమాచారం అందించగలదు. ప్రాథమిక సమాచారం కోసం స్థానిక సేవా కేంద్రాల్లో క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది.

Jugalbandi Chatbot

తాము జుగల్‌బందీని చాట్‌బోట్‌ ప్లస్‌ ప్లస్‌గానే చూస్తామని. చాట్‌బోట్‌ వ్యక్తిగత సహాయకుడు లాంటిదని ఐఐటీ మద్రాస్‌లోని AI4భారత్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ అభియాన్‌రామన్‌ తెలిపారు. చాట్‌బోట్‌... మీరు మీ భాషలో చెప్పిన సమస్యను అర్థం చేసుకొని.. అందుకు సరైన సమాధానం అందించేందుకు ప్రయత్నం చేస్తుంది. మీ ప్రశ్నకు సంబంధించిన సమాధానం ఇతర భాషల్లో లేదా డేటాబేస్‌లో ఉన్నాగానీ అక్కడ నుంచి సమాచారం సేకరించి, వినియోగదారునికి అందిస్తుందని అభియాన్‌రామన్‌ వివరించారు.

ఏప్రిల్‌లో హర్యానాలోని బియాన్‌ గ్రామస్థులకు చాట్‌బోట్‌ జుగల్‌బందీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ చాట్‌బోట్‌ భారతదేశంలోని 22 అధికారిక భాషలు ఉండగా అందులో 10 భాషల్లో విస్తరించి ఉంది. 20,000 ప్రభుత్వ కార్యక్రమాల్లో సుమారు 171 కార్యక్రమాల సమాచారం చాట్‌బోట్‌ వద్ద ఉంది.

జుగల్‌బందీ చాట్‌బోట్‌కు లాగ్వేజ్‌ మోడల్‌లను AI4భారత్‌ నుంచి, రీజనింగ్‌ మోడల్స్‌ను మైక్రోసాఫ్ట్‌ అజుర్ ఓపెన్‌ ఏఐ సర్వీ్స్‌ నుంచి అందించబడ్డాయి. వాట్సాప్‌ ద్వారా ఈ చాట్‌బోట్‌తో సంభాషణ చేయవచ్చు.

ఉదాహరణకు ఓ గ్రామస్థుడు టెక్ట్స్‌ లేదా ఆడియో రూపంలో వాట్సాప్‌ ద్వారా జుగల్‌బందీ చాట్‌బోట్‌ను సంప్రదిస్తే.. ఏఐ4భారత్‌ స్పీచ్‌ రికగ్నైజేషన్‌ వ్యవస్థ టెక్ట్స్‌ ఫార్మాట్‌లోకి మారుస్తుంది. అనంతరం బాషిణి ట్రాన్సిలేషన్‌ మోడల్‌ ఆ టెక్స్ట్‌ను ఇంగ్లీష్‌లోకి అనువాదం చేస్తుంది.

అనంతరం అజురు ఓపెన్‌ఏఐ సర్వీస్‌ మోడల్‌.. ప్రశ్నకు సంబంధించిన సమాచారం సేకరిస్తుంది. సమాధానాన్ని హిందీలోకి ట్రాన్సిలేట్‌ చేస్తుంది. అనంతరం ఏఐ4భారత్‌ మోటల్‌ ఆ సమాధానాన్ని ఆడియో రూపంలో మళ్లీ వాట్సాప్‌కు పంపుతుంది. ఆ ఆడియోను విని సమాధానం తెలుసుకోవచ్చు.

2022 జులైలో కేంద్ర ప్రభుత్వం భాషిణి ట్రాన్సిలేషన్‌ టూల్‌ను విడుదల చేసింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మరియు సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్సిడ్‌ కంప్యూటింగ్ వంటి పరిశోధన సంస్థలు భాషిని ప్లాట్‌ఫాం విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నిలేకని మరియు అతని భార్య రోహిణి ప్రారంభించిన నిలేకని ఫిలాంత్రోపీస్‌, మైక్రోసాఫ్ట్‌ నుంచి ఏఐ4భారత్‌ నిధులు అందుతున్నాయి.

సుప్రీం కోర్టులో కలికి పనిచేస్తూ తీర్పులను ఎలా అనువదించాలో తమ బృందం తొలుత అన్వేషించినట్లు ఏఐ4భారత్‌ సహా ప్రధాన పరిశోధకుడు మరియు మైక్రోసాఫ్ట్‌ ప్రధాన పరిశోధకుడు అయిన ప్రత్యూష్‌ కుమార్‌ వెల్లడించారు. వీడియోను ట్రాన్సిలేట్‌ చేసేందుకు లేదా వాటికి సబ్‌టైటిల్‌లు జతచేసేందుకు వివిధ పాఠశాలలు, కళాశాలలతో పనిచేసినట్లు చెప్పారు. దీంతో చిన్నారులు మరింత చక్కగా నేర్చుకొనేందుకు ఇవి సహాయపడనున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
IIT Madras and Microsoft combined hands for Jugalbandi Chatbot to access govt services
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X