ఇకపై అగ్రికాప్టర్‌తో రైతుల పని మరింత సులువు
ఇప్పటివరకూ పొలాల్లో పురుగు మందులు చల్లాలన్నా స్పేలు కొట్టాలన్నా రైతులు లేకుంటే కూలీలు ఆ పని చేస్తున్నారు. అయితే వారు ఆ పురుగుల మందు ప్రభావంతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు.దీనికి ప్రధాన కారణం ఆ పురుగు మందులు గాల్లో కలిసి అవి చల్లుతున్న రైతులు, కూలీలు ఆ గాలిని పీల్చడమే. ఈ గాలిని పీల్చడం వల్ల అనారోగ్యాలపాలవుతున్నారు. ఎంతోమంది. చనిపోతున్నారు. ఓ రిపోర్ట్ ప్రకారం దేశంలో ఏడాదికి 10వేల మంది రైతులు పెస్టిసైడ్, కెమికల్ ప్రభావంతో చనిపోతున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. దీనికి చెక్ పెడుతూ మద్రాస్ IIT విద్యార్థులు ఓ కొత్త ప్రయోగం చేశారు.

వ్యవసాయమే దేశానికి వెన్నెముక అనే ఇండియాలో రైతుకు మేలు చేయాలని ఐఐటీ మద్రాస్ స్టూడెంట్లు "స్మార్ట్ అగ్రికాప్టర్"ను తయారుచేశారు. ఇది ఉంటే ఇక రైతులు పొలాల్లో పురుగు మందులు చల్లాల్సిన పని లేదు. ఇదే చల్లుతుంది, ఇదే స్ప్రే చేస్తుంది. దీంతో పాటు దీనికి ఉన్న ఇమేజింగ్ కెమెరాతో పంటను ఫొటోలు తీస్తుంది. తద్వారా పంట పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు.ప్రస్తుతం రైతులు పురుగు మందులు చల్లేందుకు ఎంత ఖర్చవుతుందో అంతే ఖర్చుతో అగ్రికాప్టర్ 10 రెట్లు వేగంగా 100 శాతం ఖచ్చితత్వంతో పురుగు మందులు చల్లుతుంది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇండియన్ ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రామ్ నుంచి పది లక్షల రూపాయల నగదును రివార్డుగా అందుకున్నారు. ఈ పరికరంతో పొలాల్లో పురుగుల మందును మీరే రిమోర్ట్ సాయంతో స్ప్రే చేయొచ్చు.

అసలు ఏయే పంటలకు రైతులు ఎలా పురుగు మందులు చల్లుతున్నారు? ఎలా స్ప్రే చేస్తున్నారో గమనించారు. అందుకు తగినట్లుగా డ్రోన్‌ని ఎలా మలచాలి అన్నది ఆలోచించారు. వారు తయారుచేసిన స్మార్ట్ అగ్రికాప్టర్ పొలాల్ని మ్యాప్ రూపంలో చెక్ చేస్తూ దానంతట అదే ఎంతెంత స్ప్రే చెయ్యాలో, ఎక్కడెక్కడ చల్లాలో తెలుసుకుంటుంది. అందువల్ల రైతులు దాన్ని అదేపనిగా ఆపరేటింగ్ చెయ్యాల్సిన పనిలేదని విద్యార్థులు తెలిపారు.మార్కెట్లో రూ.15లక్షల వరకూ ఇదే రకమైన డ్రోన్లు దొరుతున్నప్పటికీ ఈ అగ్రికాప్టర్ మాత్రం రూ.5.1లక్షలకే దొరుకుతుంది. దానికి కారణం ఇందులో ప్రయోగించిన సాఫ్ట్‌వేర్, మిగిలిన పనిముట్లు మేం సొంతగా తయారుచేసినవే' అని వర్మ వెల్లడించాడు. ఈ ప్రయోగంలో వర్మతో పాటు కావిన్ కైలాశ్, ఆకాశ్ ఆనంద్‌లు సహకరించారు.

ముగ్గురు విద్యార్థుల ఆలోచన
ముగ్గురు విద్యార్థులకు ఈ ఆలోచన వచ్చింది. తాము తయారుచేసిన అగ్రికాప్టర్‌కు పేటెంట్ కోసం అప్లై చేసుకున్నారు విద్యార్థులు. ఎక్కువ మొత్తంలో వాటిని ఉత్పత్తి చేస్తే ధర భాగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం వాడిన డ్రోన్ ఒకేసారి 15 లీటర్ల పురుగు మందులను మొయ్యగలదు. పేటెంట్ వచ్చేలోగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని పొలాలపై పురుగు మందులు చల్లేందుకు ఎలాంటి మార్పులు చెయ్యాలో అవి కూడా చేస్తామంటుని స్టూడెంట్స్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








