ఫేస్‌బుక్ ఫ్రెండ్ నచ్చలేదని అమెరికా వీసా రద్దు

By Hazarath
|

మీరు అమెరికా వెళుతున్నారా..అయితే మీ ఫేస్‌బుక్ ప్రెండ్స్ లిస్ట్ ను ఒక్కసారి సరిచూసుకోండి.లేకుంటే మీరు అమెరికాకు వెళ్లలేరు. ఎందుకంటే అధికారులు మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఒకతను మాకు నచ్చలేదు అందుకే మీకు అమెరికా టికెట్ క్యాన్సిల్ చేస్తామని చెబుతారు.. ఏందీ ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోకండి.. న్యూస్ చూస్తే మీకే తెలుస్తుంది.

ఫేస్‌బుక్‌లో చేసే పోస్టింగ్స్‌తో పాటు

ఫేస్‌బుక్‌లో చేసే పోస్టింగ్స్‌తో పాటు

ఫేస్‌బుక్‌లో చేసే పోస్టింగ్స్‌తో పాటు ఫాలోయర్స్ వల్ల కూడా సమస్యలొస్తున్నాయి. తెలిసో తెలియకో ఏదో పోస్ట్ చేయడం వల్ల ఇబ్బంది రావడమే కాదు. మనల్ని ఫాలో అవుతున్న వారి వల్ల కూడా తంటాలు తప్పడం లేదు.

ఇటీవలి కాలంలో అమెరికా వెళుతున్న వారికి

ఇటీవలి కాలంలో అమెరికా వెళుతున్న వారికి

ఇటీవలి కాలంలో అమెరికా వెళుతున్న వారికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్యారిస్ బాంబు దాడుల ఘటన అనంతరం ఇలాంటి తనిఖీలు మరీ ఎక్కువయ్యాయి.

అప్పటికే నాలుగు సార్లు అమెరికా పర్యటించిన అభ్యర్థికే
 

అప్పటికే నాలుగు సార్లు అమెరికా పర్యటించిన అభ్యర్థికే

ఫేస్‌బుక్‌లో ఫాలోయర్స్ వల్ల ఇబ్బంది తలెత్తిన తాజా సంఘటన వెలుగు చూసింది. ఇదెవరికో కాదు అప్పటికే నాలుగు సార్లు అమెరికా పర్యటించిన అభ్యర్థికే ఈ సమస్య తలెత్తింది. బ్రిటన్‌కు చెందిన ఇమామ్ అజ్మల్ మస్రూర్‌కు అమెరికా అధికారుల నుంచి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.

బంగ్లాదేశ్ కు చెందిన అజ్మల్ మస్రూర్

బంగ్లాదేశ్ కు చెందిన అజ్మల్ మస్రూర్

బంగ్లాదేశ్ కు చెందిన అజ్మల్ మస్రూర్ బ్రిటన్ లో స్థిరపడ్డాడు. 2010లో బ్రిటన్ లోని లిబరల్ డెమాక్రట్స్ తరఫున బేథల్ గ్రీన్ అండ్ బొ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బ్రిటన్ ముస్లిం కౌన్సిల్ సభ్యుడిగా పనిచేయడమే కాకుండా వివిధ టెలివిజన్ చానెళ్లకు ప్రజెంటర్ గా అనేక కార్యక్రమాలు నిర్వహించాడు.

డిసెంబర్ నెలలో మాత్రం చేదు అనుభవం

డిసెంబర్ నెలలో మాత్రం చేదు అనుభవం

ఇప్పటికే నాలుగుసార్లు అమెరికా పర్యటించిన అజ్మల్ డిసెంబర్ నెలలో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. న్యూయార్క్‌లోని క్వీన్స్ మసీదులో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్ హిత్రూ నుంచి జేఏఎఫ్ విమానాశ్రయానికి బయలుదేరగా విమానాశ్రయంలో అధికారులు ఆయనను అడ్డుకున్నారు. అనుమతించేది లేదని తేల్చిచెప్పారు.

వీసా ఉన్నప్పటికీ ఎందుకు అడ్డుకున్నారని

వీసా ఉన్నప్పటికీ ఎందుకు అడ్డుకున్నారని

వీసా ఉన్నప్పటికీ ఎందుకు అడ్డుకున్నారని అజ్మల్ మస్రూర్ ప్రశ్నించినప్పుడు ఆయనకు అమెరికా అధికారుల నుంచి ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది.

ఆయన ఫేస్‌బుక్‌లోని 4500 మంది ఫాలోయర్స్‌లో

ఆయన ఫేస్‌బుక్‌లోని 4500 మంది ఫాలోయర్స్‌లో

ఆయన ఫేస్‌బుక్‌లోని 4500 మంది ఫాలోయర్స్‌లో ఒక వ్యక్తి అధికారులకు నచ్చలేదు. అజ్మల్ గతంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. వాటిని దృష్టిలో ఉంచుకొనే ఆయన బిజినెస్ వీసాను రద్దు చేసినట్టు అమెరికన్ ఎంబసీ అధికారులు వెళ్లడించారు.

 

 

ఫేస్‌బుక్‌లో వేలాది మంది తనను ఫాలో అవుతుంటారని

ఫేస్‌బుక్‌లో వేలాది మంది తనను ఫాలో అవుతుంటారని

ఫేస్‌బుక్‌లో వేలాది మంది తనను ఫాలో అవుతుంటారని, అందులో వారెవరో కూడా తనకు తెలియదని, దానిపై తనకు నియంత్రణ కూడా ఉండదని, నేను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా ఫాలో కావొచ్చు.

సోషల్ మీడియా అదొక ఓపెన్ ఫోరం

సోషల్ మీడియా అదొక ఓపెన్ ఫోరం

సోషల్ మీడియా అదొక ఓపెన్ ఫోరం. పైగా అమెరికా అధికారులు ఎవరి గురించి చెబుతున్నారో కూడా సమాధానమివ్వలేదని అజ్మల్ అంటున్నారు. అమెరికా వెళ్లకుండా తనను ఎందుకు బ్యాన్ చేశారో చెప్పాల్సిన అవసరముందని అంటున్నాడు.

ఈ విషయంలో అమెరికా అధికారుల సమాధానం కోసం

ఈ విషయంలో అమెరికా అధికారుల సమాధానం కోసం

ఈ విషయంలో అమెరికా అధికారుల సమాధానం కోసం వేచిచూస్తున్నా.. దాని తర్వాత న్యాయవాదులను సంప్రదిస్తానని అజ్మల్ చెబుతున్నారు. అమెరికా పర్యటించే విషయంలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైన వారి వివరాల కోసం అజ్మల్ ఇప్పుడో వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు.

Best Mobiles in India

English summary
Here Write Imam banned from flying to New York because US did not like one of his Facebook followers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X