పాకిస్తాన్‌కు ముఖేష్ అంబానీ ఇచ్చిన షాక్ ఏంటో తెలుసా ?

ఇప్పటివరకూ పీఎస్ఎల్ కు అఫీషియల్ ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్ తో ఏ మాత్రం భాగస్వామ్యాన్ని కొనసాగించదని సంస్థ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. తక్షణం తమ నిర్ణయం అమలులోకి వచ్చినట్టన

|

పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌.. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్‌ను ఉపసంహరించుకున్న భారత ప్రభుత్వం.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీని 200% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా ఆ దేశ క్రికెట్‌ బోర్డ్‌ పీసీబీకి భారత ఛానెల్‌ డీస్పోర్ట్స్‌ గట్టిషాక్‌ ఇచ్చింది.ఇదిలా ఉంటే సైనికుల కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా నిరసిస్తూ, పీఎస్ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్)నుంచి తప్పుకోవాలని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఐఎంజీ - రిలయన్స్ నిర్ణయించింది.

పాకిస్తాన్‌కు ముఖేష్ అంబానీ ఇచ్చిన షాక్ ఏంటో తెలుసా ?
ఇప్పటివరకూ పీఎస్ఎల్ కు అఫీషియల్ ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్ తో ఏ మాత్రం భాగస్వామ్యాన్ని కొనసాగించదని సంస్థ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. తక్షణం తమ నిర్ణయం అమలులోకి వచ్చినట్టని, ఇదే విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి కూడా తెలియజేశామని అన్నారు.

పీఎస్ఎల్ తో కుదుర్చుకున్న ఒప్పందం

పీఎస్ఎల్ తో కుదుర్చుకున్న ఒప్పందం

కాగా, పీఎస్ఎల్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐఎంజీ - రిలయన్స్ పలు మ్యాచ్ ల లైవ్ కవరేజ్ కి అవసరమయ్యే వనరులను సమకూర్చాల్సివుంది. వివిధ దేశాల్లోని టీవీ చానళ్లకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, కవరేజ్ చేసే వ్యక్తులు, కెమెరాలు, ఓబీ వ్యాన్ లు వంటి ఇతర మౌలిక వసతులను కల్పించాల్సివుంది.

డీ-స్పోర్ట్ చానల్ లో ప్రసారం

డీ-స్పోర్ట్ చానల్ లో ప్రసారం

ఇండియాలో పీఎస్ఎల్ పోటీలు 2017లో డిస్కవరీ ఛానల్ ప్రారంభించిన డీ-స్పోర్ట్ చానల్ లో ప్రసారం అవుతుంటాయి. ఉగ్రదాడులకు పాల్పడే పాకిస్థాన్ వంటి దేశాలతో వాణిజ్యపరమైన బంధం అవసరం లేదని భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ పేర్కొంది.

పుల్వామా ఉగ్రదాడి

పుల్వామా ఉగ్రదాడి

అలాగే ఆపదలో ఉన్నవారికి ఎప్పుడూ అండగా ఉండే సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ పుల్వామా బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు సిద్ధమైంది. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధ్యత తీసుకుంటామని ప్రకటించింది.

రిలయన్స్ ఫౌండేషన్

రిలయన్స్ ఫౌండేషన్

ఆ కుటుంబంలోని పిల్లల చదువులు, వారి ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆ ఫ్యామిలీలు జీవనోపాధికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చింది. ఇంతటితోనే తాము ఆగిపోబోమని, రిలయన్స్ ఫౌండేషన్ సహకారం ఎక్కడ అవసరం అని ప్రభుత్వం భావిస్తే, తాము అక్కడ సంపూర్ణంగా మద్దతు ఇస్తామని ప్రకటించింది.

Best Mobiles in India

English summary
IMG-Reliance not to broadcast Pakistan Super League over Pulwama attack

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X