ఈ స్పీకర్‌కు బ్లుటూత్, వై-ఫై అక్కర్లేదు!

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీ జీబ్రానిక్స్ 'Amplify' పేరుతో సరికొత్త వైర్‌లెస్ ఆడియో యాంఫ్లిఫైయర్ ఇండక్షన్ స్పీకర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.999. ఆన్‌లైన్ మార్కెట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్‌లలో ఈ స్పీకర్ అందుబాటులో ఉంటుంది.

ఈ స్పీకర్‌కు బ్లుటూత్, వై-ఫై అక్కర్లేదు!

కేవలం 330 గ్రాముల బరువుతో వస్తోన్న ఈ లైట్ వెయిట్ పోర్టబుల్ స్పీకర్ ప్రత్యేకమైన ఇండక్షన్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంది. ఈ స్పీకర్ నుంచి వెలువడే ఆడియో, శక్తివంతమైన అవుట్‌పుట్‌ను కలిగి క్లియర్ సౌండ్‌ను మీకు ఆఫర్ చేస్తుంది. ఈ స్పీకర్‌ను, మీ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసేందుకు ఎటువంటి బ్లుటూత్, వై-ఫై కనెక్షన్ అవసరం లేదు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ స్పీకర్‌కు బ్లుటూత్, వై-ఫై అక్కర్లేదు!

స్పీకర్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మొబైల్ హోల్డర్‌లో ఫోన్‌ను ఉంచి మ్యూజిక్‌ను ఆన్ చేస్తే చాలు. ఫోన్ నుంచి వెలువుడే మ్యూజిక్‌ను ఈ యాంప్లిఫైయర్ స్పీకర్ తనలోకి ఇమిడింపచేసుకుని వివిధ్ మోడ్‌లలో నాణ్యమైన అవుట్‌పుట్‌ను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. దాదాపుగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లను ఈ స్పీకర్ సపోర్ట్ చేస్తుందని జీబ్రానిక్స్ చెబుతోంది.

ఈ స్పీకర్‌కు బ్లుటూత్, వై-ఫై అక్కర్లేదు!

స్మార్ట్‌ఫోన్‌‌ల ద్వారా హైక్వాలిటీ మ్యూజిక్‌ను ఆస్వాదించాలనుకునే వారి కోసం ఈ పోర్టబుల్ స్పీకర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసారు. రబ్బర్ ఫినిషింగ్‌తో వస్తోన్న ఈ ట్రెండీ లుకింగ్ స్పీకర్‌లో ఇండక్షన్, aux అనే రెండు మోడ్స్ ఉంటాయి. 1000 ఎమ్ఏహెచ్ Li-ion బ్యాటరీని ఈ స్పీకర్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. స్పీక‌ర్‌లో మీరు ఎంచుకునే మోడ్‌ను బట్టి ఈ బ్యాటరీ ప్లేబ్యాక్ టైమ్ 6 నుంచి 8 గంటల మధ్య ఉంటుంది.

మార్కెట్లో లాంచ్ అయిన సరికొత్త స్పీకర్స్, స్మార్ట్ వాచెస్ ఇంకా ఇతర యాక్సెసరీస్ గురించి తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Immerse in music with the new Zebronics Portable Induction Speaker. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting