నరేంద్ర మోడీ సరికొత్త రికార్డ్!!

Posted By: Prashanth

నరేంద్ర మోడీ సరికొత్త రికార్డ్!!

 

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి, ఐట్యూన్స్ అప్లికేషన్ స్టోర్ ప్రత్యేక గుర్తింపునిస్తూ ఐవోఎస్(iOS) అప్లికేషన్‌ను అంకింతమిచ్చింది. ప్రత్యేకించి మోడీ కోసం ఈ స్టోర్ ‘ఐమోడీ’ పేరుతో అప్లికేషన్‌ను డిజైన్ చేసింది. దింతో ఐవోఎస్ అప్లికేషన్ పొందిన మొట్ట మొదటి భారత రాజకీయ నాయకుడిగా మోడీ చరిత్ర సృష్టించారు. ఐఫోన్, ఐప్యాడ్ తదితర ఆపిల్ గ్యాడ్జెట్‌లను వినియోగిస్తున్న వినియోగదారులు ‘ఐమోడీ’ అప్లికేషన్‌ను

ఐట్యూన్స్ స్టోర్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మార్చి 29 నుంచి ఈ అప్లికేషన్ సేవలు ప్రారంభమయ్యాయి. మోడీ అధికారిక సైట్ కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న నిర్వాహకులే ఈ అప్లికేషన్ నిర్వహణ బాధ్యతలను చేపడుతున్నారు. ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారు నరేంద్ర మోడీ ప్రసంగాలను వీక్షించటంతో పాటు పాటు గుజరాత్ గవర్నమెంట్ పాలసీలు తదితర అభివృద్థి పనులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వారి వారి అభిప్రాయాలను సందేశాల రూపంలో నేరుగా మోడీకి పంపవచ్పు. టెక్నాలజీ సేవలను ఉపయోగించుకోవటంలో మోడీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. టెక్నాలజీ సాయంతో ఆ రాష్ట్రంలో నిర్వహిసున్న అనేక అభివృద్థి కార్యక్రమంలో మిశ్రమ ఫలితాలను రాబడుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot