Home
News

Budget 2024 ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్మార్ట్‌ఫోన్ల తయారీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ (Budget 2024) ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రెవేశపెడతారు. ఎన్నికల సంవత్సరం కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు మాత్రమే ఈ బడ్జెట్‌ అమల్లో ఉంటుంది. అందువల్ల దీన్ని ఓట్‌ ఆన్‌ అకౌంట్ బడ్జెట్ అంటారు.

ఈ బడ్జెట్‌పై దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో సానుకూల ప్రకటనలను వస్తాయని భావిస్తున్నారు. ఏయే వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఏయే వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందనే ప్రకటన కోసం వేచిచూస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ రంగంపై ప్రభావం ఎంత మేర ఉండనుందనేది రేపు తెలియనుంది.

import duty slashed on mobile phone components

బడ్జెట్‌ లైవ్‌ వివరాలు : ఫిబ్రవరి 1వ ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌ లైవ్‌ను దూరదర్శన్‌ సహా పార్లమెంట్ టీవీల ద్వారా చూడవచ్చు. దీంతోపాటు ఆయా సంస్థల అధికారిక యూట్యూబ్‌, సోషల్‌ మీడియా వేదికల ద్వారా కూడా బడ్జెట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

మధ్యంత బడ్జెట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్‌ విడిభాగాల దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 15 శాతం నుంచి 10 శాతానికి (import duty slashed on mobile phone components) తగ్గించింది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్లు బ్యాటరీ కవర్లు, కెమెరా లెన్స్, బ్యాక్‌ కవర్‌, GSM యాంటెన్నా సహా ఫ్లోన్లు తయారీ చేసే ప్లాస్టిక్‌, మెటల్‌ దిగుమతి సుంకాలు తగ్గాయి.

import duty slashed on mobile phone components

ఈ నిర్ణయంతో దేశంలో మరిన్ని ఫోన్ల తయారీ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఎగుమతులు పెరగడం సహా ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ గట్టి పోటీనిస్తుందని ICEA (ఇండియా సెల్యూలర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్‌) అభిప్రాయం వ్యక్తం చేసింది.

కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో రానున్న కాలంలో దేశంలో ఫోన్ల ధరలు తగ్గుతాయిని తెలుస్తోంది. ముఖ్యంగా 5G స్మార్ట్‌ఫోన్లు అందుబాటు ధరకు కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. భారీ స్థాయిలో మేడిన్‌ ఇండియా ఉత్పత్తులు ప్రపంచానికి పరిచేయం చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

వచ్చే రెండు సంవత్సరాల్లో భారత్‌ నుంచి మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు మూడు రెట్లు పెరుగుతాయని ICEA పేర్కొంది. ఫలితంగా 39 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో సుమారు 50 బిలియన్‌ డాలర్ల విలువైన మొబైల్‌ ఫోన్‌లను తయారవుతాయని అంచనా వేసింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Government reduced import duty on mobile phone components ahead of budget 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X