ఇంటర్నెట్ చరిత్రలో గుర్తుపెట్టుకోవల్సిన సంవత్సరాలు

|

ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లమంది కమ్యూనికేషన్ అవసరాలను తీరుస్తున్న అంతర్జాలం(ఇంటర్నెట్) గురించి అనేక ఆసక్తికర అంశాలను తెలుసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. 1983 జనవరి ఒకటో తేది నుంచి ఇంటర్నెట్ అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది. అయితే మొట్టమొదటి ఇంటర్నెట్ ప్రయోగం 1969, మే1వ తేదీనే జరిగింది. తరువాత ఏర్పడ్డ శాటిలైట్, కేబుల్, టవర్ వ్యవస్థలు ఇంటర్నెట్‌ను భూగోళమంతా వ్యాపింపచేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇంటర్నెట్ చరిత్రలో చోటుచేసుకున్న మైలురాళ్లను మీ ముందుంచుతున్నాం...

 
ఇంటర్నెట్ చరిత్రలో గుర్తుపెట్టుకోవల్సిన  సంవత్సరాలు

ఏవోఎల్ తక్షణ సందేశ సేవలు, ప్రారంభం 1997:

 

ఈ కంట్రోల్ వీడియో కార్పొరేషన్‌ను 1983లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలకు ఈ కంపెనీ ఆన్‌లైన్ సర్వీస్‌లను అందిస్తోంది. సంస్థ ప్రధానకార్యాలయం న్యూయార్క్ నగరంలోని 770 బ్రాడ్‌వేలో ఉంది.

గూగుల్ , ప్రారంభం 1998:

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌ను 1998లో ప్రారంభించారు. లారీ పేజ్, సెర్జీ బ్రిన్‌లు ఈ కంపెనీని స్థాపించారు.

కొత్త కేబుల్ లైన్‌లు, ప్రారంభం 2000:

కమ్యూనికేషన్ విస్తరణలో భాగంగా కొత్త కేబుల్ లైన్‌లు ఏర్పడ్డాయి. వీటిని ఇతర భూభాగంలోకి సముద్ర మార్గం గుండా వ్యాపింప చేశారు. ఈ ప్రక్రియనే సబ్ మెరైన్ కమ్యూనికేషన్ అంటారు. సముద్ర గర్భాల్లో వినియోగిస్తున్న ఆధునిక వర్షన్ కేబుల్స్ ఫైబర్ టెక్నాలజీని కలిగి డిజిటల్, ఇంటర్నెట్ ఇంకా టెలికమ్యూనికేషన్ డేటాను సెకన్లలో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాయి.

వికీపీడియా, ప్రారంభం 2000:

వివిధ అంశాలకు సంబంధించిన డాటా వివిధ భాషల్లో ఇక్కడ లభ్యమవుతుంది. ఈ టాపిక్‌లను ఎవరైనా ఎడిట్ చేయవచ్చు. అంతర్జాలంలో వికీపీడియాకు గొప్స స్ధానం ఉంది.

ఆన్‌లైన్ ఫైల్ షేరింగ్ :

డిజిటల్ వర్షన్‌లో స్టోర్ చేసిన సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా షేర్ చేసే ప్రక్రియ 2001లో ప్రారంభమైంది. ఇంటర్నెట్ చరిత్రలో ఇదో గొప్ప మైలురాయిగా భావించవచ్చు.

స్కైప్, 2003:

నెటిజనులు అత్యధికంగా వినియోగించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లలో స్కైప్ (skype)ఒకటి, ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సర్వీస్ ఇంటర్నెట్ ద్వారా ఉచిత వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు ఉపకరిస్తుంది. హీన్లా, ప్రిట్, జాన్ తాల్లిన్ అనే ముగ్గురు డెవలపర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను వృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్కైప్‌కు 600 మిలియన్‌ల యూజర్లు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, స్కైప్ ప్లాట్‌ఫామ్‌ను 2011లో $8.5బిలియన్‌లు చెల్లించి సొంతం చేసుకుంది. ఫైల్ ట్రాన్స్‌ఫర్, వీడియో కాన్ఫిరెన్సింగ్ వంటి అదనపు ఫీచర్లను స్కైప్ కలిగి ఉంది.

యూట్యూబ్, 2004:

యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు

డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను అధికారికంగా 2005 నవంబర్‌లో ప్రారంభించారు. సాన్ బ్రూనో ఈ కపెంనీని నెలకొల్పారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్$1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది.

ఫేస్‌బుక్, 2004:

100కోట్ల పై చిలుకు యాక్టివ్ యూజర్లతో సోషల్ నెట్‌వర్కింగ్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు.

యాపిల్ ఐప్యాడ్ ఆవిష్కరణ, 2010:

పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువచేస్తూ యాపిల్ ఐప్యాడ్ పేరుతో సరికొత్త కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌ను ఏప్రిల్3, 2010న ఆవిష్కరించింది. ప్రస్తుత మార్కెట్లో 4వ తరం ఐప్యాడ్ ఇంకా ఐప్యాడ్ మినీలు లభ్యమవుతున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X