ట్విట్టర్ ఎకౌంట్‌ని ఓపెన్ చేసిన 'డా.మన్మోహన్ సింగ్'

భారతదేశం ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశంలో ఉన్న యువకులతో కమ్యూనికేట్ అయ్యేందుకు గాను ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో చేరారు. @PMOIndia పేరుతో ఉన్న ఈ ట్విట్టర్ ఎకౌంట్‌లో ముఖ్యమైన న్యూస్, ఈవెంట్స్‌ని ప్రధానమంత్రి ఆఫీసు నుండి ట్వీట్ చేయనున్నారు. అమెరికా వైట్ హౌస్(@whitehouse) తరహాలో ఈ ఎకౌంట్‌ని వినియోగించనున్నారు.
ప్రముఖ ఇంగ్లీషు ఛానల్ బిబిసికి ప్రధానమంత్రి ఆఫీసు ఇచ్చిన ఇంటర్యూలో ట్విట్టర్ ఎకౌంట్‌ని ప్రారంభించడానికి గల కారణాలను వెలిబుచ్చారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఎల్లప్పుడూ పనిలో బిజీగా ఉంటుంది. మన్మోహాన్ సింగ్ ఒక సంవత్సరంలో 30-45 ట్రిప్పులకు వెళుతుంటారు. వీటికి సబంధించిన సమాచారం ప్రజలకు తెలియడం లేదు. ఈ ట్విట్టర్ ఖాతా వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందజేస్తుంది. ఈ ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రి దేశంలో ఉన్న యువతకు తన సందేశాలు అందచేయవచ్చుననే ఉద్దేశ్యంతో ప్రారంభించామని అన్నారు.
ప్రపంచంలో ఉన్న అందరి లీడర్స్ మాదరి కాకుండా, మన్మోహాన్ ఎప్పుడూ మీడియాతో తక్కువగా మాట్లాడుతుంటే విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ట్విట్టర్ ఎకౌంట్‌ని ప్రధాని మన్మోహాన్ టీమ్ నిర్వహిస్తుంది. ట్విట్టర్‌లో ఎకౌంట్‌ని ప్రారంభించిన ఒక్కరోజులోనే 9,000 మంది ఫాలోవర్స్ దీనిని ఫాలో అవుతున్నారు.
భారతదేశ ప్రధాని ట్విట్టర్ ఎకౌంట్‌ని ఫాలో అవ్వాలని అనుకున్న వన్ ఇండియా పాఠకులు ఈ లింక్ ద్వారా http://twitter.com/PMOIndia ఫాలో అవ్వొచ్చు. ఇండియాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 1.8 మిలియన్ ఫాలోవర్స్‌తో మొదటి స్దానంలో ఉన్నారు.


Click it and Unblock the Notifications








