Home
News

ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో సిమ్ కార్డులు లేకుండానే మొబైల్ కాల్స్‌.. టెక్నాలజీలో సంచలనం.

No SIM calls: ఇన్నాళ్లూ ఫోన్ కాల్స్ చేయాలంటే సిమ్ కార్డులు తప్పనిసరి. మనం ఏ నెట్‌వర్క్ వాడుతున్నామో, ఎక్కడి నుంచి కాల్స్ చేయగలమో నిర్ణయించేది సిమ్ కార్డులే. కానీ, సిగ్నల్ సరిగా లేని మారుమూల ప్రాంతాల్లో, అత్యవసర సమయాల్లో కూడా ఫోన్ కాల్స్ చేయడం కష్టంగా మారుతోంది. సహాయం కావాల్సిన వేళ ఇది పెద్ద సమస్యగా మారుతుంది. అయితే, ఇప్పుడు మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్లు ఒక కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నారు.

దీని ద్వారా సిమ్ కార్డు లేకుండానే కాల్స్ చేసుకోవచ్చు. ఈ దిశగా శాటిలైట్ నెట్‌వర్క్ టెక్నాలజీ చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. చాలా టెలికాం కంపెనీలు దీనిపై దృష్టి పెట్టాయి. త్వరలోనే ఇది మన కమ్యూనికేషన్ రూపురేఖలు మార్చేయనుంది. మరి ఈ శాటిలైట్ నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

In the Near Future  No SIM calls Needed for Mobile  This Technology Will Change Everything

* శాటిలైట్ నెట్‌వర్క్

ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్‌లు ఎలా పనిచేస్తున్నాయో చూస్తే ఇది అర్థం చేసుకోవడం సులువు. ఇప్పుడు ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్స్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా మనకు అందుతున్నాయి. సెంట్రల్ సర్వర్ నుంచి సిగ్నల్స్ బేస్‌స్టేషన్‌కు వెళ్తాయి. అక్కడి నుంచి టవర్ల ద్వారా చుట్టుపక్కల యూజర్లకు చేరుతాయి. కానీ, శాటిలైట్ నెట్‌వర్క్‌లో ఈ ప్రాసెస్ పూర్తిగా మారిపోతుంది.

సెల్ టవర్లపై ఆధారపడకుండా, శాటిలైట్లు నేరుగా గ్రౌండ్ స్టేషన్ల నుంచి సిగ్నల్స్ అందుకుంటాయి. ఆ తర్వాత వాటిని డైరెక్ట్‌గా మొబైల్ ఫోన్లు, ఇతర డివైజ్‌లకు పంపిస్తాయి. అంటే, కొండలు, అడవులు, సముద్రాలు.. ఇలా మారుమూల ప్రాంతాల్లో కూడా కాల్స్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి.

* శాటిలైట్ నెట్‌వర్క్ వల్ల లాభాలు..

సిమ్ కార్డులు అక్కర్లేదు. శాటిలైట్ ద్వారా కాల్స్ వెళ్తాయి కాబట్టి, సిమ్ కార్డులతో పని ఉండకపోవచ్చు. ఎక్కువ కవరేజ్ మరో లాభం. మొబైల్ టవర్లు లేని కొండలు, అడవులు, సముద్రాల వంటి ప్రాంతాలకు కూడా సిగ్నల్స్ అందుతాయి. వరదలు, భూకంపాలు లాంటి విపత్తులు సంభవించినప్పుడు మొబైల్ టవర్లు పనిచేయకపోయినా, శాటిలైట్ నెట్‌వర్క్‌లు పనిచేస్తాయి.

ఇంటర్నెట్ విస్తరణ కూడా సాధ్యమవుతుంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ అందుతుంది. దీనివల్ల విద్య, వైద్యం, వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. ప్రతి ఒక్కరికి సమాచారం తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు చాలా తక్కువ ధరకే వాళ్లకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది.

* ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి..

శాటిలైట్ కమ్యూనికేషన్ ఇప్పటికే దూసుకుపోతోంది. ఎలాన్ మస్క్ (Elon Musk) స్టార్‌లింక్ (Starlink) ప్రాజెక్ట్ ద్వారా శాటిలైట్లను ఉపయోగించి ప్రపంచమంతా ఇంటర్నెట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వొడాఫోన్-ఐడియా (Vodafone-Idea) కూడా శాటిలైట్ కాల్స్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ టెక్నాలజీ త్వరలోనే ఇండియాలో అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న శాటిలైట్ కమ్యూనికేషన్ రాబోయే రోజుల్లో మనం కాల్స్ చేసుకునే విధానాన్ని, ఇంటర్నెట్ వాడే పద్ధతిని పూర్తిగా మార్చేస్తుంది. త్వరలోనే మొబైల్ నెట్‌వర్క్‌లకు సిమ్ కార్డులు అవసరం లేకుండా పోవచ్చు. కమ్యూనికేషన్ మరింత సులువుగా, వేగంగా, అందరికీ అందుబాటులో ఉండేలా మారుతుంది. ఇలాంటి టెక్నాలజీని ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తారని చెప్పొచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
SIM cards may become obsolete with satellite networks enabling calls everywhere. This technology offers better coverage, reliable communication, and expands internet access, especially in remote areas, revolutionizing mobile connectivity.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X