ఇన్‌బాక్స్ జీమెయిల్ షట్ డౌన్, ఏం చేయాలో తెలుసుకోండి

టెక్ గెయింట్ గూగుల్ వినియోగదారులకు సరికొత్త అలర్ట్ ని అందించింది. ఇన్‌బాక్స్ బై జీమెయిల్ యూజర్లకు ఓ బ్యాడ్ న్యూస్ ని అందించింది. ఇన్‌బాక్స్ బై జీమెయిల్ వాడుతున్న యూజర్లు ఏప్రిల్ 2 నుంచి దాన్ని యాక్సెస

|

టెక్ గెయింట్ గూగుల్ వినియోగదారులకు సరికొత్త అలర్ట్ ని అందించింది. ఇన్‌బాక్స్ బై జీమెయిల్ యూజర్లకు ఓ బ్యాడ్ న్యూస్ ని అందించింది. ఇన్‌బాక్స్ బై జీమెయిల్ వాడుతున్న యూజర్లు ఏప్రిల్ 2 నుంచి దాన్ని యాక్సెస్ చేసుకోలేరు. ఈ యాప్ ఆ తేదీ నుంచి ఇక కనపడదు. ఇన్‌బాక్స్ ద్వారా మీ మెయిల్స్‌ను యాక్సెస్ చేసుకోవడం కుదరదు.

ఇన్‌బాక్స్ జీమెయిల్ షట్ డౌన్, ఏం చేయాలో తెలుసుకోండి

వచ్చే నెలలో గూగుల్ షట్ డౌన్ చేసే వాటిలో గూగుల్ ప్లస్ ఒక్కటే కాదు.. ఇన్‌బాక్స్ బై జీమెయిల్ యాప్ కూడా ఉంది. గత సంవత్సరమే ఈ యాప్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్టు గూగుల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

గూగుల్ నోటిఫికేషన్

గూగుల్ నోటిఫికేషన్

అయితే గూగుల్ ఎప్పుడు దాన్ని క్లోజ్ చేస్తుందో మాత్రం అప్పుడు తెలియజేయలేదు. తాజాగా దాన్ని షట్‌డౌన్ చేసే తేదీని వెల్లడించింది. మీరు ఒకవేళ ఇన్‌బాక్స్ యూజర్లయితే.. ఇంకో 12 రోజులు మాత్రమే దాన్ని యాక్సెస్ చేసుకోగలరు.
ఇన్‌బాక్స్ బై గూగుల్, గూగుల్ ప్లస్ రెండు ప్లాట్‌ఫాంలను ఒకేరోజు అంటే ఏప్రిల్ 2న గూగుల్ షట్ డౌన్ చేస్తోంది. ఈ యాప్ ఉపయోగిస్తున్న వాళ్లకు గూగుల్ నోటిఫికేషన్ పంపిస్తుంది. 2014లో ఈ యాప్‌ను గూగుల్ లాంచ్ చేసింది.

ఎక్కువగా మెయిల్స్‌తో

ఎక్కువగా మెయిల్స్‌తో

ప్రతి రోజు ఎక్కువగా మెయిల్స్‌తో పని చేసే వాళ్ల కోసం రూపొందించిందే ఈ యాప్. ఈ మెయిల్ యాప్ ద్వారా యూజర్లకు ఆటోమెటిక్‌గా రిప్లయిలు, ఒకేసారి వేల మెయిల్స్ పంపించుకోవచ్చు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఈయాప్ ద్వారా ఎక్కువ పనిని తక్కువ సమయంలో చేయొచ్చు.

టెక్నికల్ సమస్యల వల్ల

టెక్నికల్ సమస్యల వల్ల

రెండు వారాల కింద కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఇన్‌బాక్స్ యాప్ కొంతమంది యూజర్లకు డౌన్‌లోడ్ కాలేదు. ఇన్‌బాక్స్ బై జీమెయిల్‌లో స్మార్ట్ రిప్లయి, నడ్జెస్, ఇన్‌లైన్ అటాచ్‌మెంట్స్ లాంటి స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. అయితే.. ఈ ఫీచర్స్ జీమెయిల్ యాప్‌లో ఉండవు.

జీమెయిల్ లోకి మారాల్సిందే.

జీమెయిల్ లోకి మారాల్సిందే.

ఇకపై ప్రతి ఒక్కరూ జీమెయిల్ లోకి మారాల్సిందేనని గూగుల్ తెలియేసింది. గూగుల్ ప్లస్ వాడుతున్న యూజర్లు కూడా ఇకపై దాన్ని వినియోగించ లేరు. అందులో ఏదైనా డాటా ఉంటే వెంటనే దాన్ని వేరే దానిలోకి మార్చుకోవాలని గూగుల్ కోరింది

Best Mobiles in India

English summary
Inbox by Gmail Is Officially Shutting Down on April 2

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X