ఐపీఎల్ కిక్..జోరుమీదున్న వెబ్‌సైట్లు!!

Posted By: Staff

 ఐపీఎల్ కిక్..జోరుమీదున్న వెబ్‌సైట్లు!!

 

ఐపిఎల్ మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రజలు వెబ్‌సైట్లు, స్మార్ట్ ఫోన్లను ఆశ్రయిస్తున్నారని టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్, నీల్సన్ సర్వేలో తేలింది. నీల్సన్  సంస్థ 5000 స్మార్ట్‌ఫోన్లను ట్రాక్ చేస్తే అధిక శాతం మంది ఐపిఎల్ కోసం క్రికెట్ అప్లికేషన్లు, వెబ్‌సైట్లను చూస్తున్నట్లు తేలింది. ఈ సంఖ్య రానురాను పెరుగుతోందని కూడా ఈ సంస్థ గుర్తించింది. స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువ మంది క్రిక్‌బస్, క్రికెట్ కంపానియన్, ఐపిఎల్2012, ఇఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో, అఫీషియల్ డిఎల్ఎఫ్ ఐపిఎల్ 2012, యాహూ స్పోర్ట్స్ వెబ్‌సైట్లను దర్శిస్తున్నారు. ఐపిఎల్ ప్రారంభ వేడుకల నిమిత్తం ఐపిఎల్ వెబ్‌సైట్‌ను 1.37 కోట్ల మంది వీక్షించారు. గత ఏడాది ఈ సంఖ్య 88 లక్షలు మాత్రమే. మొత్తం మీద వెబ్‌సైట్ల వీక్షణలో 56 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు నీల్సన్ తేల్చిచెప్పింది.

వీనలవిందైన  ఐపీఎల్ పొట్టి క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాలను హైస్పీడ్ ఇంటర్నెట్ వ్యవస్థతో అంతరాయం లేకుండా పలు ఆన్‌లైన్ సైట్లు అందిస్తున్నాయి. అరేరే మ్యాచ్ స్టార్ట్ అయిపోయిందే.. ఇంకా పనిలోనే  ఉన్నానే అని నిరుత్సహాపడకండి. ఐపీఎల్ క్రికెట్‌ రసవత్తర క్షణాలను  రెప్పపాటు మిస్ కాకుండా ఉండేందుకు మీ స్మార్ట్ ఫోన్ లేదా పీసీలోకి లాగినై కింద పేర్కొన్న వెబ్ సైట్లలోకి ప్రవేశించి ఉత్కంఠభరిత వినోదాన్ని ఏంజాయ్ చెయ్యండి.

•Cricket365.net: http://www.cricket-365.net/2011/04/sony-set-max-live-streaming-ipl-2011.htm

•livecricket.bollym4u.com: http://livecricket.bollym4u.com/

•360cricket.com: http://www.360cricket.com/

•IPL Streaming: http://iplstreaming.com/

•IPLT20.com: http://www.iplt20.com/

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot