92.93 కోట్లు... ఎయిర్‌టెల్ టాప్!

Posted By: Prashanth

92.93 కోట్లు... ఎయిర్‌టెల్ టాప్!

 

మే నెలలో కొత్తగా 83.5లక్షల మంది మొబైల్ కనెక్షన్‌లు పొందటంతో దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్‌ల సంఖ్య 92.937కు చేరినట్లు టెలికా రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. ఏప్రిల్ నాటికి మొబైల్ యూజర్ల సంఖ్య 92.102కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్ మేలో అత్యధికంగా 20 లక్షల కొత్త వినియోగదారులను రాబట్టుకోగలిగింది.

దింతో కంపెనీకి చెందిన వినియోగదారుల సంఖ్య 18.53కోట్లకు చేరింది. రెండవ స్థానంలో నిలిచిన ఐడియా సెల్యూలర్ 17.5 లక్షల కొత్త యూజర్లను వసం చేసుకుంది. తరువాతి స్థానంలో నిలిచిన యూనినార్ 15.2 లక్షల కొత్త కస్టమర్ లను ఆకర్షించగలిగింది. నాల్గవ స్థానంలో నిలిచిన వొడాఫోన్ 2.5 లక్షలు, ఐదో స్థానంలో నిలిచిన ఎయిర్ సెల్ 8 లక్షలు, ఆరో స్థానంలో నిలిచిన ఆర్ కామ్ 5 లక్షలు, ఏడో స్థానంలో నిలిచిన సిస్టం శ్యామ్ 2.5 లక్షల యూజర్లతో ముందుకు సాగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ మేలో 81,000మంది యూజర్ లను పోగొట్టుకోగా... ఎమ్ టీఎన్ఎల్ కు 1.7 లక్షల మంది దూరమయ్యారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot