Home
News

లోక్‌సభ ఎన్నికల్లో హ్యాకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రమాదం ఉంది.. మైక్రోసాఫ్ట్‌ కీలక హెచ్చరిక!!

భారత్‌లో ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. ఏప్రిల్‌ 19 నుంచి 7 దశల్లో జూన్‌ 1 వరకు సార్వత్రిక ఎన్నికలు (Loksabha Elections 2024) జరగనున్నాయి. ఎన్నికలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టూల్స్‌ నుంచి ముప్పు ఉందని తెలుస్తోంది. చైనాకు చెందిన వ్యక్తుల నుంచి ఈ ప్రమాదం ఉందని తెలిసింది. ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ మేరకు తన బ్లాగ్‌లో పోస్టు చేసింది.

ముఖ్యంగా ఈ సంవత్సరం ఎన్నికల జరగనున్న అమెరికాలోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial intelligence) టూల్స్‌ ద్వారా ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా భారత్‌, అమెరికా, సౌత్‌ కొరియా వంటి దేశాల్లో తమ ప్రయోజనాల కోసం చైనా ఈ తరహా కంటెంట్‌ ద్వారా ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనా వేసింది.

microsoft warning to india and america ahead of general election 2024 with AI and Hacking

హ్యాకర్లకు ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ప్రధాన ఆయుధంగా మారుతుందని మైక్రోసాఫ్ట్‌ అభిప్రాయపడింది. వీడియోలను మార్ఫింగ్ చేయడం మరియు వ్యక్తుల వాయిస్‌ను మార్చి ప్రచారం చేయడం ద్వారా లక్షల మందికి చేరుకొనేందుకు ఉపయోగపడుతుంది. చైనా మరియు అమెరికా మధ్య వాణిజ్య సంబంధిత విభేదాలు మరియు భారత్‌తో వివిధ విభేదాలతో చైనా గత కొంతకాలంగా ఈ రెండు దేశాలలో విభేదిస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు తన అనుకూలంగా మార్చుకొనేందుకు చైనా సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలను ఉపయోగిస్తోంది. అయితే ఎన్నికల్లో అవాంతరాలు కలిగించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను చూపిస్తు మైక్రోసాఫ్ట్‌ చెప్పిన కొన్ని అంశాల్లో 2023 ఆగస్టులో మౌయి ఘటన కూడా ఉంది. మిలిటరీ గ్రేడ్‌ ఆయుధాన్ని పరీక్షించిన కారణంగా మంటలు చెలరేగినట్లు పేర్కొంది.

ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టూల్స్ ద్వారా కంటెంట్‌ను క్రియేట్‌ చేసి వైరల్‌ చేయడంపై మైక్రో సాఫ్ట్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఈ సంవత్సరం జరిగే తైవాన్ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఈ తరహా టెక్నాలజీని ఉపయోగించడం గురించి తన బ్లాక్‌లో రాసుకొచ్చింది.

మీమ్స్‌, వీడియోలు, ఆడియోల క్రియేట్‌ చేయడం వంటి ప్రయోగాలు చైనాలో మరింత పెరిగే అవకాశం ఉంది. మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. అమెరికా, భారత్‌, ఇతర దేశాలను ముందస్తు హెచ్చరికలను జారీచేసింది. ఇప్పటికే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతున్న నష్టాలను గురించి తెలిసిందే. ప్రభుత్వాలు వీటి కట్టడికి కీలక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
microsoft warning to india and america ahead of general election 2024 with AI and Hacking
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X