నోకియా నూతన సీఈఓగా రాజీవ్ సూరి

Posted By:

నోకియా కంపెనీ నూతన సీఈఓగా భారత సంతతి వ్యక్తి రాజీవ్ సూరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రస్తుతం ఆ కంపెనీ టెలికం పరికరాల వ్యాపార విభాగానికి హెడ్‌గా కొనసాగుతున్నారు. కొద్ది రోజుల క్రితమే నోకియా కంపెనీని మైక్రోసాఫ్ట్ 7.2బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

ఈ నేపధ్యంలో రాజీవ్ సూరీని నోకియా కంపెనీ నూతన సీఈఓగా నియమిస్తూ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ సూరి మే 1వ తేది నుంచి సీఈఓ బాధ్యతులు చేపట్టే అవకాశముంది.

మంగళూరు యూనివర్శిటీలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన రాజీవ్ సూరి 1995 నుంచి నోకియా కంపెనీలో విధులు నిర్విహిస్తున్నారు. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న నోకియా కంపెనీని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తారనే నమ్మకంలో రాజీవ్ సూరిని సీఈఓగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

రాజీవ్ సూరి మంగళూరు విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసారు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ విభాగంలో బ్యాచిలర్స్ పట్టా అందుకున్నారు. కొద్ది నెలల క్రితమే మైక్రోసాఫ్ట్ సీఈఓగా భారత సంతతి వ్యక్తి సత్య నాదెళ్ల ఎంపికైన విషయం తెలిసిందే.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot