ఇండియా-చైనా బోర్డర్ లో యుద్ధ వాతావరణం! డ్రోన్లతో పహారా!

By Maheswara
|

ఇండియా చైనా సరిహద్దులలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.గడచిన నెల రోజుల నుండి కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్త పరిస్థితులు గత వారం హింసాత్మకం గా మారిన సంగతి అందరికి తెలిసిందే.

అత్యాధునిక  డ్రోన్లతో

మళ్ళీ ఇటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా నిలువరించేందుకు మరియు ప్రత్యర్థుల కదలికలను పసిగట్టేందుకు రెండు వైపులా సేనలు అత్యాధునిక  డ్రోన్లతో పహారా మొదలుపెట్టారు. ఆ డ్రోన్ల వివరాలు మరియు వాటి సామర్థ్యాల గురించి తెలుసుకుందాం రండి

హెరాన్ డ్రోన్

హెరాన్ డ్రోన్

ఈ హెరాన్ డ్రోన్ అనేది మన ఇండియన్ ఆర్మీ ఉపయోగిస్తున్న డ్రోన్.ఇది ఇజ్రాయిల్ లో తయారైంది.ఇది MALE (Medium Altitude Long Endurance )  రకానికి చెందినది.ఇది 45 గంటల పాటు 1000 కిలోమీటర్ల వరకూ ఆగకుండా ఎగరగలదు.దీని ద్వారా భూమికి 35000 అడుగుల ఎత్తునుండి భూమి పై ఉన్న వస్తువులు, వాహనాల కదలికల గురించి కచ్చితంగా తెలుసుకోవచ్చు.

క్వాడ్ కాఫ్టర్లు
 

క్వాడ్ కాఫ్టర్లు

ఆర్మీ జవాన్లు ఉపయోగించడానికి సులువుగా ఉండే మరియు ఎక్కడికైనా సులభం గా మోసుకెళ్లగలిగే చిన్న సైజు క్వాడ్ కాఫ్టర్ లను కూడా  రంగం లోకి దించింది మన సైన్యం. వీటి సామర్థ్యం తక్కువే అయినప్పటికీ చిన్నవిగా ఉండటం వాళ్ళ సీక్రెట్ గా ఫోటోలు తీసి కావలసిన సమాచారాన్ని చేరవేస్తాయి.

చైనా డ్రోన్లు

చైనా డ్రోన్లు

చైనా ఆర్మీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ డ్రోన్లతో పహారా కు సిద్ధమైంది.భారత సైనికుల కదలికలను తెలుసుకునేందుకు థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ తో పనిచేసే మావిక్ 2 డ్రోన్లను వాడినట్టు తెలుస్తోంది.ఇవి మనిషి శరీరం లో ఉండే ఉష్ణోగ్రతల ను గుర్తించే టెక్నాలజీ తో పనిచేస్తాయి.చైనా లో కరోనా వైరస్ సోకినా వారిని గుర్తించదానికి కూడా ఈ డ్రోన్లను వాడారు.

వింగ్ లూన్గ్ డ్రోన్

వింగ్ లూన్గ్ డ్రోన్

చైనా తరపున  గస్తీ కాస్తున్న డ్రోన్లలో మరోటి వింగ్ లూన్గ్ డ్రోన్లు ఇవి రెండు రకాలుగా ఉన్నాయి వింగ్ లూన్గ్ 1 మరియు వింగ్ లూన్గ్ 2 . ఇవి గస్తీ కాయడమే కాక దాడులు చేయడానికి బాంబు లు మిస్సైల్ లు కూడా మోసుకెళ్ల గలవు.

అత్యాధునిక యుద్ధ విమానాలు

అత్యాధునిక యుద్ధ విమానాలు

ఇవే కాక ఇరువైపుల నుండి వాయుసేన సంబంధించి అత్యాధునిక యుద్ధ విమానాలు మరియు హెలికాప్టర్ తో కూడిన బృందాలు ఎల్లప్పుడూ గస్తీ కాస్తూనే ఉన్నాయి.ఇండియా చైనా బోర్డర్ లలో ఉద్రిక్తత పరిస్థితుల కారణం గా ఇప్పటికే దేశంలో చైనా వస్తువుల బహిష్కరణ గురించి మీకు ఇది వరకే తెలియ చేసి ఉన్నాము.

Best Mobiles in India

Read more about:
English summary
India China News: India and China both armies deployed drones at the border

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X