ఇండియాలో 5జీ మీద వస్తున్నరూమర్లు ఇవే !

దేశంలో ఇప్పటికే 4జీ సేవలు పూర్తి స్థాయిలో ఆరంభం కాని నేపథ్యంలో అప్పుడే 5జీ మీద టెస్టింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

|

దేశంలో ఇప్పటికే 4జీ సేవలు పూర్తి స్థాయిలో ఆరంభం కాని నేపథ్యంలో అప్పుడే 5జీ మీద టెస్టింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. కాగా దీనిపై పలు అంచనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దేశంలో తదుపరి తరం టెలికం సేవలైన 5జీ ఆధారిత సర్వీసులు 2022 నాటికి అందుబాటులోకి వస్తాయని ఎరిక్సన్‌ మొబిలిటీ అంచనా వేసింది. ఇక 4జీ సర్వీసులను వాడే వారి సంఖ్య 2023 చివరి నాటికి 78 శాతానికి పెరుగుతుందని... అదే సమయంలో 5జీ చందాదారులు కోటికి చేరతారని ఈ సంస్థ ఓ నివేదికలో తెలియజేసింది. 2018 చివరి నాటికి వాణిజ్య పరంగా 5జీ సేవలు ఆరంభం కావచ్చని ఎరిక్సన్‌ మొబిలిటీ రిపోర్ట్‌ (ఈఎంఆర్‌) ఎడిటర్‌ ప్యాట్రిక్‌ సెర్వాల్‌ తెలిపారు.

 

ఇండియాలో బ్యాన్ దిశగా వాట్సప్, ప్రభుత్వ కఠిన నిర్ణయానికి కారణం ఏంటీ ?ఇండియాలో బ్యాన్ దిశగా వాట్సప్, ప్రభుత్వ కఠిన నిర్ణయానికి కారణం ఏంటీ ?

2023 నాటికి మొత్తం ..

2023 నాటికి మొత్తం ..

2017 ముగిసే నాటికి 4జీ ఎల్‌టీఈ చందాదారుల వాటా ఇండియాలో 20 శాతంగా ఉంది. భారత్‌లో యూజర్లు అత్యాధునిక టెక్నాలజీల వైపు ఆకర్షితులవుతున్నారని, 2023 నాటికి మొత్తం మొబైల్‌ చందాదారుల్లో 78 శాతం (78 కోట్ల కనెక్షన్లు) ఎల్‌టీఈవే ఉంటాయని ఈ నివేదిక పేర్కొంది.

4జీ కనెక్షన్లు 550 కోట్లు

4జీ కనెక్షన్లు 550 కోట్లు

2023 చివరి నాటికి అంతర్జాతీయంగా 4జీ కనెక్షన్లు 550 కోట్లుగా ఉంటాయని అంచనా వేసింది. ఇదే సమయంలో 5జీ చందాదారులు కోటికి చేరతారని ఎరిక్సన్‌ మొబిలిటీ అంచనా వేస్తోంది.

మొబైల్‌ చందాదారుల వృద్ధిలో
 

మొబైల్‌ చందాదారుల వృద్ధిలో

అంతర్జాతీయంగా సంఖ్యా పరంగా మొబైల్‌ చందాదారుల వృద్ధిలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. 2018 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) నికరంగా 1.6 కోట్ల చందాదారులు పెరగడంతో మొత్తం చందాదారుల సంఖ్య 118 కోట్లకు చేరారు.

చైనా మొదటి స్థానంలో

చైనా మొదటి స్థానంలో

మొబైల్‌ చందాదారుల వృద్ధిలో చైనా మొదటి స్థానంలో ఉంది. జవనరి-మార్చి కాలంలో 5.3 కోట్ల కనెక్షన్లు పెరిగాయి. దీంతో చైనాలో మొబైల్‌ చందాదారుల సంఖ్య 147 కోట్లకు చేరింది.

2023 నాటికి 97 కోట్లకు..

2023 నాటికి 97 కోట్లకు..

భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం 2023 నాటికి 97 కోట్లకు చేరుతుందని, 2017 చివరి నాటికి ఈ సంఖ్య 38 కోట్లేనని ఈ నివేదిక తెలియజేసింది. 5జీ స్మార్ట్‌ఫోన్లు 2019 తొలి అర్ధభాగంలో రావడం ప్రారంభమవుతుందని సెర్వాల్‌ పేర్కొన్నారు.

 స్మార్ట్‌ఫోన్ల వినియోగం వృద్ధితో

స్మార్ట్‌ఫోన్ల వినియోగం వృద్ధితో

ఇక స్మార్ట్‌ఫోన్ల వినియోగం వృద్ధితో భారత్‌లో నెలవారీ మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ 2017చివరి నాటికి ఉన్న 1.9ఈబీ (ఎక్సాబైట్‌) నుంచి 10ఈబీ స్థాయికి పెరుగుతుందని అంచనా వేసింది.

Best Mobiles in India

English summary
India to get 5G services by 2022, 4G to see four-fold increase: Ericsson More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X