4కె TV మార్కెట్లో ఇప్పుడు ఇండియా రారాజు ఎవరు, ఆప్సన్ మీదే..

Written By:

ఇండియా టీవీ మార్కెట్ ఇప్పుడు high dynamic range (HDR) technologyలో దూసుకుపోతోంది. 4K TVsతో ఇండియన్ టీవీ మార్కెట్ ని ఏలేందేకు సిద్ధమవుతున్నారు. OLED screens ఒక్కసారిగా మార్కెట్లో ప్రాముఖ్యతను సంతరించుకుంది. బడ్జెట్ ధరలో ఈ స్క్రీన్ టీవీలను మార్కెట్లోకి తీసుకువచ్చి యూజర్లను ఆకర్షించాలని అన్ని కంపెనీలు కసరత్తులు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే దిగ్గజ కంపెనీలు కొత్త 4కె టీవీలను ఈ మధ్య వరుసగా మార్కెట్లోకి రిలీజ్ చేశాయి. Panasonic, Videocon, Samsung, Vu ఇతర కంపెనీలన్నీ స్మార్ట్ టీవీలతో మార్కెట్లో సత్తా చాటుతున్నాయి. సరికొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీతో యూజర్లకు అద్భుతమైన అనుభూతిని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీలు ఏంటో ఓ లుక్కేద్దాం.

షియోమికి దిమ్మతిరిగే షాక్, అత్యంత తక్కువ ధరకే స్మార్ట్‌టీవీలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Vu టీవీ, LG టీవీ

Vu టీవీ
ఈ కంపెనీ మూడు వేరియంట్లలో తన 4కె టీవీలను రిలీజ్ చేసింది. 43-inch, 49-inch and 55-inchలలో ఈ టీవీలను లాంచ్ చేసింది. వీటి ధర రూ. 36,999 నుంచి ప్రారంభం కానుంది.
LG టీవీ
ఈ కంపెనీ తన 32-inch LED TVని మార్కెట్లో రిలీజ్ చేసింది. దీని ధరను రూ. 19,789గా నిర్ణయించింది. కాగా పానాసోనిక్ pixel-perfectతో రూ.17,00 ధరలో సరికొత్త టీవీని లాంచ్ చేసింది.
అయితే ఇవన్నీ మార్కెట్లో సత్తా చాటుతున్నాయి. అయితే వీటిని సవాల్ చేస్తూ మార్కెట్లోకి మరో టీవి దూసుకొచ్చిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది.

ఫ్రెంచ్ టీవీ బ్రాండ్ ధామ్సన్

వీటికి ప్రత్యామ్నాయం కావాలనుకున్న వారు 120 సంవత్సరాల అనుభవం కల ఫ్రెంచ్ టీవీ బ్రాండ్ ధామ్సన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఒకప్పుడు టీవీల రంగంలో తిరుగులేని ఆధిపత్యం సంపాదించుకున్న ఈ కంపెనీ ఇప్పుడు అదే ఊపును కొనసాగించేందుకు మార్కెట్లోకి కొత్త టీవీలను రిలీజ్ చేసింది. లేటెస్ట్ టెక్నాలజీతో మూడు స్మార్ట్ టీవీలను ఇండియా మార్కెట్లోకి రిలీజ్ చేసింది. మిలియన్ మంది ఇండియన్ల హృదయాలను గెలుచుకున్న ఈ కంపెనీ తన సరికొత్త టీవీలను Flipkartలో ఎక్స్ క్లూజివ్ గా విక్రయిస్తోంది. అయితే అమ్మకానికి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఈ టీవీలు అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి.

32, 40, 43 inches మూడు వేరియంట్లలో

ఈ కంపెనీ 32, 40, 43 inches మూడు వేరియంట్లలో టీవీలను విడుదల చేసింది. వీటి ధర రూ. 13,999 నుంచి ప్రారంభం కానుంది. స్మార్ట్ యాప్స్ తో వచ్చిన ఈ టీవీలు మీ లివింగ్ రూంను మరింత అందంగా చూపిస్తాయి. మరి అంతలా యూజర్లను ఆకర్షిస్తున్న ఈ టీవీల స్పెషాలిటీ ఏంటి....ఈ టీవీలో స్పెషల్ గా ఏం ఫీచర్లు ఉన్నాయనే దానికి చాలానే సమాధానాలు ఉన్నాయి.

ఫీచర్లు

Design & Build:
43-inches version టీవీ తక్కువ బరువు అలాగే ప్లాస్టిక్ మెటల్ తో ఉంటుంది. ఈ రకమైన ఫీచర్ ద్వారా మీరు ఎటువంటి అంతరాయం లేకుండా చాలా సింపుల్ గా మీ లివింగ్ రూంలో ఈ టీవీని సెట్ చేసుకోవచ్చు.
Interface & Smart TV Features:
ఆండ్రాయిడ్ 4.4మీద రన్ అయ్యే ఈ టీవీలో సంప్రదాయ యాప్స్ ఉన్నాయి. అందరికీ ఎంతో ఇష్టమైన యాప్స్ ని టీవీతో పాటే పొందుపరిచారు. వాటిలో Netflix, YouTube, SoundCloud,లాంటివి ఉన్నాయి. వీటితో పాటు NY Times, CNN, BBC, Wikipedia, Gmail సైట్లను కూడా మీరు సెర్చ్ చేసుకునే అవకాశం ఉంది.

ఆడియో వీడియో

two 10Watt down-firing speakersని ఈ టీవీలో పొందుపరిచారు. ఈ ఫీచర్ ద్వారా మీరు విజువల్ చూస్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయే సౌండ్ దానికి తగ్గట్లుగా వస్తుంది. కాగా విజువల్ 3840 x 2160 ultra high definition (UHD) or 4K resolutionతో యూజర్లను ఇట్టే కట్టిపడేస్తుంది.

ధరలు

కాగా మార్కెట్లో 43-inches Smart TV ధర రూ.27,999గా ఉంది. 4కె బిగ్ స్క్రీన్ లో ఇదే బడ్జెట్ ధరలో లభిస్తున్న టీవీ. అలాగే 40-inches Smart TV ధర రూ. 19,999గా ఉంది. 32-inches Smart TV ధర రూ.13,490గా ఉంది. ఫీచర్లు ఇతర టీవీలకు ధీటుగా స్మార్ట్ ఫోన్లు ఉండే వాటికి సమానంగా కొన్ని యాప్స్ ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
India Has Chosen It’s Favourite Smart LED TV. And It Might Not Be What You’re Guessing Right Now! more news at gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot