Home
News

భారత్ అమెరికాను వెనక్కి నెట్టేసింది

భారత్ 2016లో మొబైల్ డెవలప్ మెంట్ కోర్సులపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. ఈ విషయంలో అగ్రరాజ్యాన్ని సైతం మించిపోయిందని గూగుల్ తెలిపింది.

By Hazarath

2016లో భారత్ ఏ విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపిందో తెలుసా. 2016లో గూగుల్‌లో భారత్ అగ్రరాజ్యాన్ని దాటుకుపోయిన అంశం ఏదో తెలుసా..ఇటువంటి విషయాలను గూగుల్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. భారత్ 2016లో మొబైల్ డెవలప్ మెంట్ కోర్సులపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. ఈ విషయంలో అగ్రరాజ్యాన్ని సైతం మించిపోయిందని గూగుల్ తెలిపింది.

జియోకి ఉచిత ఆఫర్ తిప్పలు, రేపటిలోగా స్పందన

శోధన అంశాల్లో

శోధన అంశాల్లో

గత రెండేళ్లలో శోధన అంశాల్లో భారత్ నుంచి మొబైల్ డెవలప్‌మెంట్ కోర్సులకు ఎక్కువగా వృద్ధి నమోదైందని, ఈ వృద్ధి 200 శాతం మేర ఉందని గూగుల్ వెల్లడించింది.

ప్రతినెలా 16,500 విద్యార్థులు

ప్రతినెలా 16,500 విద్యార్థులు

కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలు ఈ కోర్సులను ఎక్కువగా సెర్చ్ చేశారని పేర్కొంది. మొబైల్ డెవలపర్ కోర్సులకు విపరీతమైన డిమాండ్‌ను తాము చూశామని, ప్రతినెలా 16,500 మంది విద్యార్థులు ఈ కోర్సులో నమోదుచేసుకున్నారని గూగుల్ డెవలపర్ ట్రైనింగ్ ఓ ప్రకటనలో తెలిపింది.

స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా వాడుతున్న దేశాలలో

స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా వాడుతున్న దేశాలలో

220 మిలియన్ల యాక్టివ్ డివైజ్‌లతో స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా వాడుతున్న దేశాలలో భారత్ అమెరికాను అధిగమిస్తుందని, ఈ నేపథ్యంలో మొబైల్ ప్లాట్‌ఫామ్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో అమితమైన ఆసక్తి కనబడుతుందని పేర్కొంది.

మొబైల్ డెవలప్‌మెంట్‌కు

మొబైల్ డెవలప్‌మెంట్‌కు

ఉత్తరప్రదేశ్ నుంచి కూడా మొబైల్ డెవలప్‌మెంట్‌కు అత్యధిక వృద్ధి నమోదవుతోందని, ఈ రాష్ట్రంలో యేటికేటికి 70 శాతం గణనీయమైన పెరుగుదని చూశామని తెలిపింది.

ప్రపంచంలోనే భారత్

ప్రపంచంలోనే భారత్

విద్యాపరమైన శోధనల్లో ప్రపంచంలోనే భారత్ ముందంజలో ఉందని, వొకేషనల్ ట్రైనింగ్ కోర్సులకు క్రమేపీ డిమాండ్ పెరుగుతుందని చెప్పింది. అమెరికాతో పోల్చుకుంటే భారత్‌లో 65 శాతానికి పైగా మొబైల్ డెవలపర్ అభ్యాసకులు కాలేజీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లేనని సింప్లిలెర్న్ సీఈవో కృష్ణా కుమార్ చెప్పారు.

 

 

Best Mobiles in India

English summary
India Has Greatest Interest in Mobile Development Courses, Says Google Read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X