స్మార్ట్‌ఫోన్ విడిభాగాలపై 10 శాతం దిగుమతి సుంకం
స్మార్ట్‌ఫోన్లలో ప్రధాన విడిభాగాలైన కెమెరా మాడ్యుల్, ప్రింటెండ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ, కనెక్టర్లపై 10 శాతం దిగుమతి సుంకం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్మార్ట్‌ఫోన్లలో ప్రధాన విడిభాగాలైన కెమెరా మాడ్యుల్, ప్రింటెండ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ, కనెక్టర్లపై 10 శాతం దిగుమతి సుంకం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశీయంగా వీటి ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టినట్లు సమాచారం. 2018-19 బడ్జెట్‌లో మొబైల్ ఫోన్లపై విధిస్తున్న కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా సోమవారం దిగుమతి సుంకానికి సంబంధించిన నోటిఫికేషన్ పత్రాల్ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు రెవెన్యూ శాఖ కూడా దిగుమతి సుంకం పెంపుపై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐసీఏ వివరాల ప్రకారం.. 2014లో ప్రపంచవ్యాప్తంగా తయారైన మొబైల్ ఫోన్లలో భారత్ 3 శాతం మాత్రమే ఉత్పత్తి చేయగా, 2017 నాటికి ఇది 11 శాతానికి చేరింది.

దీంతో వియత్నాంను వెనక్కు నెట్టి భారత్ రెండో స్థానాన్ని చేజిక్కించుకొంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఈ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం 10 శాతం సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో దేశీయంగా తయారీ పరిశ్రమ పుంజుకునే అవకాశం ఉంది. అలాగే మేక్ ఇన్ ఇండియాకి ఊతం ఇచ్చినట్లు అవుతుందని చిన్న తరహా వ్యాపారుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ప్రతి ఒక్క వస్తువు చైనా నుంచి దిగుమతి అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దేశీయంగా తయారీదారులకు ఇదొక గొప్ప అవకాశమని ప్రభుత్వం భావిస్తోంది.


Click it and Unblock the Notifications