ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2019 ప్రారంభ విశేషాలు....

|

ఇండియన్ గవర్నమెంట్ 2015 నుంచి ప్రతీ ఏటా సైన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ ను అంగరంగవైభవంగా జరపాలని నిర్ణయించుకుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈవెంట్‌ కోసం వేదికగా కోల్‌కతా నగరంను ఎంచుకున్నది. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ నవంబర్ 5 నుండి నవంబర్ 9 వరకు జరగనున్నది.

 గిన్నీస్ రికార్డులు సాధించినవారు

నాలుగు రోజుల పాటు జరిగే ఈవెంట్ లో వివిధ అంశాల్లో గిన్నీస్ రికార్డులు సాధించినవారు మరియు ప్రయోగాలు చేసి తమ ప్రతిభను కనబరచిన వారి సుమృతులను చాటేందుకు సరైన వేదికగా నిలుస్తోంది. అలాగే చాలా మంది విద్యార్థులు మరియు సైన్స్ ఔత్సహికులకు వారి ప్రతిభను కనబరిచేందుకు గాను ఈ వేదిక చాలా ఉపయోగపడుతుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రమోట్ చేయడంతో పాటు వివిధ రంగాల్లో భారతదేశాన్ని తక్కువ సమయంలో అభివృద్ధి వైపు పయనించేలా చేసేందుకు సైన్స్ ఎలా ఉపయోపడిందోనని పలు రంగాల కొంత మంది నిపుణులు ఈ వేదికపై చాటిచెబుతుంటారు.

5వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌
 

ఈ సంవత్సరం జరుగుతున్న 5వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ను కోల్‌కతాలోని జాయ్ నగరంలో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీగారు ప్రారంభించారు. నవంబర్ 5 నుంచి నవంబర్ 8 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మరియు విజ్ఞాన భారతి (VIBHA) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?

AICTE

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-CSIR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్-ICAR, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR లాంటి సంస్థలు కూడా ఇందులో పాల్గొంటాయి. ఈ ఈవెంట్‌ను సాయంత్రం 4 గంటలకు ప్రారంభించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభ ఉపన్యాసంతో మొదలుపెట్టారు. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు దేశవిదేశాలకు చెందిన విద్యార్థులు, ప్రతినిధులు, సైన్స్ జర్నలిస్టులు వచ్చారు. 130 దేశాల ప్రతినిధులు ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడం విశేషం.

సైన్స్ ఫెస్టివల్

సైన్స్ ఫెస్టివల్స్ ఒక దేశం యొక్క సైన్స్ మరియు టెక్నాలజీ యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యత యొక్క శక్తివంతమైన వ్యక్తీకరణ. ఇది శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు మరియు పరిశోధకులకు అన్ని వర్గాల విద్యార్థులు మరియు పౌరులతో సన్నిహితంగా సంభాషించడానికి అవకాశం ఇస్తుంది. సైన్స్ ఫెస్టివల్స్ లో సైన్స్-సంబంధిత థియేటర్, కేఫ్‌లు, సంగీతం మరియు స్టాండ్-అప్ కామెడీ రూపంలో హ్యాండ్సన్ ప్రదర్శనలు మరియు వర్క్‌షాప్‌లను ప్రదర్శించడనికి అనుమతిస్తారు. సైన్స్ ఫెస్టివల్స్ యొక్క లక్ష్యం స్ఫూర్తిదాయకమైన మరియు సాధికారిక మార్గాల్లో పౌరులను సైన్స్ తో నిమగ్నం చేయడం.

Best Mobiles in India

English summary
India International Science Festival (IISF): Things To Know

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X