2020 కల్లా 5జీ, ముందుగానే రెడీ చేసుకున్న Airtel

టెలికాం సాంకేతికతలో ప్రపంచ దేశాలతో పోటీపడేందుకు రూ.500 కోట్లతో నిధి ఏర్పాటు : టెలికం మంత్రి మనోజ్ సిన్హా

By Hazarath
|

టెలికాం సాంకేతికతలో ప్రపంచ దేశాలతో పోటీపడాలని ప్రభుత్వం యోచిస్తోంది. 4జీతో పోలిస్తే, అయిదారు రెట్ల వేగంతో డేటా బదిలీకి వీలున్న 5జీ సేవలను ప్రపంచంతో పాటే మనదేశంలోనూ ప్రారంభించాలని, అందుకనువైన ఉత్పత్తుల రూపకల్పనలోనూ క్రియాశీలక పాత్ర పోషించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో 5జీ సేవలు మరో మూడేళ్లలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

 

రోజుకి 1 జిబి కాదు, 4జిబి డేటా.. Airtel సరికొత్త ఆఫర్రోజుకి 1 జిబి కాదు, 4జిబి డేటా.. Airtel సరికొత్త ఆఫర్

5జీ అందుబాటులోకి వస్తే

5జీ అందుబాటులోకి వస్తే

5జీ అందుబాటులోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 10,000 మెగాబిట్‌ పర్‌ సెకన్‌ (ఎంబీపీఎస్‌), గ్రామీణ ప్రాంతాల్లో 1,000 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ సేవలు అందించవచ్చని టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు

వచ్చే ఏడాది మధ్య నాటికి

వచ్చే ఏడాది మధ్య నాటికి

వచ్చే ఏడాది మధ్య నాటికి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ 5జీ ప్రమాణాలను ఖరారు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలోను, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు మొదలైన వాటికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

 రూ.500 కోట్లతో నిధి
 

రూ.500 కోట్లతో నిధి

2020లో ప్రపంచంలోని పలు దేశాల్లో 5జీ సేవలు ఆరంభం కానున్నాయని, మనదేశంలోనూ అప్పుడే ప్రారంభించవచ్చని టెలికం మంత్రి పేర్కొన్నారు. 5జీ కార్యకలాపాల కోసం ముఖ్యంగా పరిశోధన, ఉత్పత్తుల అభివృద్ధి కోసం రూ.500 కోట్లతో నిధిని ఏర్పాటు చేయనుందని సిన్హా తెలిపారు.

జియో తమ 4జీ నెట్‌వర్క్‌ ద్వారా

జియో తమ 4జీ నెట్‌వర్క్‌ ద్వారా

అయితే ప్రస్తుతం ట్రాయ్‌ గణాంకాల మేరకు రిలయన్స్‌ జియో తమ 4జీ నెట్‌వర్క్‌ ద్వారా 18 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో డేటా సేవలు అందిస్తోంది.

5జీ సేవలు అందించేందుకు ఎయిర్‌టెల్‌ రెడీ

5జీ సేవలు అందించేందుకు ఎయిర్‌టెల్‌ రెడీ

వేగవంతమైన 5జీ సేవలు అందించేందుకు అనువైన టెక్నాలజీని ఇప్పటికే తాము అందుబాటులోకి తెస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది.

తొలుత బెంగళూరు, కోల్‌కతాలో ఏర్పాటు

తొలుత బెంగళూరు, కోల్‌కతాలో ఏర్పాటు

5జీ నెట్‌వర్క్‌లకు ఉపయోగపడే ఎంఐఎంవో(మాసివ్‌ మల్టిపుల్‌ ఇన్‌పుట్‌ మల్టిపుల్‌ అవుట్‌పుట్‌) టెక్నాలజీని తొలుత బెంగళూరు, కోల్‌కతాలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.

 

2-3 రెట్లు వేగవంతమైన డేటా స్పీడ్‌

2-3 రెట్లు వేగవంతమైన డేటా స్పీడ్‌

కొత్త టెక్నాలజీ ప్రస్తుత నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని 5-7 రెట్లు పెంచగలదని, 2-3 రెట్లు వేగవంతమైన డేటా స్పీడ్‌ అందించగలదని ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

టారిఫ్‌ ప్లాన్లను, ఫోన్లను మార్చాల్సిన అవసరం లేకుండా

టారిఫ్‌ ప్లాన్లను, ఫోన్లను మార్చాల్సిన అవసరం లేకుండా

కస్టమర్లు టారిఫ్‌ ప్లాన్లను, ఫోన్లను మార్చాల్సిన అవసరం లేకుండా తమ 4జీ ఫోన్లలోనే మరింత వేగవంతమైన డేటా సేవలు పొందవచ్చని వివరించింది.

Best Mobiles in India

English summary
India looking to position itself as a leader in 5G technology Read moe at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X